News April 2, 2025
వనపర్తి: ‘పండిత్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ నంబర్ కేటాయించాలి’

డీఎస్సీ 2002 హిందీ పండిట్‌గా కోర్టు ఉత్తర్వుల ద్వారా ఆలస్యంగా నియమితులైన జిల్లాలోని 8 మంది ఉపాధ్యాయులకు హైకోర్టు ఉత్తర్వుల కనుగుణంగా పాత పెన్షన్ వర్తించేలా జీపీఎఫ్ నంబర్ కేటాయించాలని విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని ద్వారా ప్రొసీడింగ్స్ ఇప్పించాలని కోరుతూ తపస్ బృందం జడ్పీ డిప్యూటీ సీఈవోకు ఈరోజు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్, సతీశ్ కుమార్, శశివర్ధన్ పాల్గొన్నారు.
Similar News
News April 10, 2025
సిద్దిపేట: పోషకాహార లోపం వల్ల ఆరోగ్య సమస్యలు: సీడీపీఓ

పోషకాహార లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని సీడీపీఓ శారదా అన్నారు. గురువారం చిన్నకోడూరు మండలం ఇబ్రహీం పూర్ గ్రామంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై ఆమె మాట్లాడారు. విద్యార్థులు మంచి పోషకాహారం ఉన్న చిరు ధాన్యాలు తినడానికి ప్రయత్నం చేయాలన్నారు.
News April 10, 2025
HYD: జరిమాణాలు విధించేందుకు ప్రత్యేక యాప్: MD

HYDలో మంచినీటిని వృథా చేయడంపై జరిమానా విధించడం కోసం ప్రత్యేక ఆప్ రూపొందించి, ప్రారంభించినట్లుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. మంచినీటిని బండలు కడగడం, అంతస్తుల క్యూరింగ్ కోసం, ఇతర అవసరాలకు ఉపయోగించ కూడదని సూచించారు. ఈ ప్రత్యేక ఆప్ ఎగ్జిక్యూటివ్ అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందుబాటులో ఉంటుందన్నారు.
News April 10, 2025
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి: ఎస్పీ

గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎస్పీ దామోదర్ చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని భీమ్ సేవా సమితి, భీమ్ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహిస్తున్న జిల్లా స్ధాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు ఇచ్చే ట్రోఫీలను గురువారం ఎస్పీ ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్‌లో 40 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ఎస్పీ కొంచెంసేపు క్రికెట్ ఆడారు.