News January 26, 2025
వనపర్తి: పండుగ వాతావరణంలో పథకాలు ప్రారంభం: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమపథకాలను జిల్లాలో జనవరి 26న పండుగ వాతావరణంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ శాంతకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ.. మండలంలో ఒక గ్రామాన్ని ఎంపికచేసి రేపు మధ్యాహ్నం 1గంటలకు నాలుగు పథకాలు ఒకేసారి ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు
Similar News
News February 16, 2025
శ్రీశైలం విశిష్టత మీకు తెలుసా…!

ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలక్షేత్రం <<15471616>>రెండోది<<>>. ఈ మందిరంలో పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. పూర్వం కుమారస్వామిని వెతకడానికి క్రౌంచ పర్వతం (శ్రీశైలం) వెళ్లిన శివుడు ఆయన ఉన్నచోటనే లింగరూపంలో వెలిశారు. అక్కడ మద్ది చెట్టుకు మల్లెతీగ అద్దుకొని ఉందట. అప్పటినుంచి స్వామి వారికి ‘మల్లికార్జునుడు’ అని పేరొచ్చిందని స్థలపురాణం పేర్కొంటుంది.
News February 16, 2025
లక్షెట్టిపేటలో భార్యను హత్య చేసిన భర్త

భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన లక్షెట్టిపేటలో జరిగింది. SI సతీశ్ వివరాల ప్రకారం.. గోదావరి రోడ్డుకు చెందిన గణేశ్ తన భార్య రాజ కుమారిని సిమెంటు ఇటుక, బండరాయితో కొట్టి చంపాడు. కాగా కొద్ది రోజులుగా గణేశ్ మద్యం తాగి వచ్చి భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని గొడవ పడేవాడన్నారు. ఆమె ఆదివారం తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్ళగా గణేశ్ వెనకాలే వెళ్లి తలపై కొట్టి చంపాడని ఎస్ఐ వెల్లడించారు.