News March 24, 2025

వనపర్తి: పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షకు 99.79 శాతం హాజరు

image

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 10వతరగతి ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని వనపర్తి డీఈఓ అబ్దుల్ ఘని తెలిపారు. సోమవారం వనపర్తి జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల సరళిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇంగ్లీష్ పరీక్షకు 6,844 మంది విద్యార్థులకు 6,830మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు.14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని 99.79 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.

Similar News

News April 1, 2025

తెనాలి: దైవ దర్శనానికి వెళుతూ అనంత లోకాలకు

image

కృష్ణా జిల్లా పులిగడ్డ వారిధి వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడంతో తెనాలిలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. చెంచుపేటకు చెందిన రవీంద్ర మోహన బాబు కుటుంబంతో సహా కారులో మోపిదేవి ఆలయానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. 21 రోజుల పసికందుతో సహ రవీంద్ర, అతని భార్య అరుణ, మనుమరాలు(5) ప్రమాదంలో మృతిచెందారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. 

News April 1, 2025

ఏపీలో 3, 4 తేదీల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలో అకాల వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. 3న రాయలసీమ, 4న ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండొద్దని సూచించింది. మరోవైపు, నిన్న రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడులో 40.3°C ఉష్ణోగ్రత నమోదైంది.

News April 1, 2025

కృష్ణా: ప్రయాణికులకు అలర్ట్.. స్టాప్ తొలగించిన రైల్వే

image

నాన్ ఇంటర్‌ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు మహబూబాబాద్(TG)లో తాత్కాలికంగా స్టాప్ తొలగించామని రైల్వే అధికారులు తెలిపారు. మే 24 నుంచి 28 వరకు నం.12749 మచిలీపట్నం-బీదర్‌ SF ఎక్స్‌ప్రెస్, నం.12709 గూడూరు-సికింద్రాబాద్ సింహపురి SF, నం.12759 తాంబరం-హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లు మహబూబాబాద్‌లో ఆగవని, ప్రయాణికులు గమనించాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.

error: Content is protected !!