News July 19, 2024

వనపర్తి: పీరు మోస్తూ.. కుప్పకూలిన యువకుడు

image

ఓ యువకుడు పీరు మోస్తూ.. కుప్పకూలిన ఘటన వనపర్తి మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. సవాయిగూడెం గ్రామానికి చెందిన గువ్వల మధుసుదన్(29) గురువారం పీరు ఎత్తుకొని గ్రామంలో ఊరేగిస్తుండగా గుండెనొప్పికి గురయ్యాడు. స్థానికులు వనపర్తి ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మధుసుదన్‌కు భార్యా, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె పుట్టుకతో దివ్యాంగురాలు.

Similar News

News October 2, 2024

MBNR: మండలాల వారిగా తుది ఓటర్ల సంఖ్య ఇలా..!

image

1.MBNR(రూరల్)-36,864, 2.అడ్డాకుల-24,147,
3.బాలానగర్-32,912,
4.రాజాపూర్-21,599,
5.నవాబ్ పేట-52,708,
6.మూసాపేట-21,305,
7.మిడ్జిల్-24,770,
8.కోయిల్ కొండ-50,845,
9.జడ్చర్ల-40,237,
10.హన్వాడ-39,417,
11.గండీడ్-61,608,
12.దేవరకద్ర-45,956,
13.సీసీ కుంట-37,474, 14.భూత్పూర్-26,359 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలోని 441 గ్రామ పంచాయతీల పరిధిలో 3,836 వార్డులు ఉండగా.. మొత్తం 5,16,183 మంది ఓటర్లు ఉన్నారు.

News October 2, 2024

‘పాలమూరు సీతాఫలాలకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు’

image

ఉమ్మడి పాలమూరు సీతాఫలాలకు వివిధ రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉంది. కొల్లాపూర్ మామిడితో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పాలమూరులో పండే సీతాఫలాలకు సైతం అదే స్థాయిలో గుర్తింపు వస్తోంది. ఈ ప్రాంతంలో ఉన్న అడవులు, వాతావరణం, వర్షపాతం తదితర కారణాలవల్ల సీతాఫలాలు మధురంగా ఉండడమే కాదు.. ఆరోగ్యాన్ని ఇవ్వడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయని ప్రచారం జరుగుతుండడంతో జాతీయస్థాయిలో పాలమూరు సీతాఫలాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.

News October 2, 2024

జూరాలలో 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి

image

జూరాల ఎగువ, దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మంగళవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తిని కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు 408.108 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు.