News March 22, 2025
వనపర్తి: పెండింగ్ నిర్మాణ పనులు పూర్తి చేయండి: కలెక్టర్

వనపర్తి జిల్లాలో వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను మార్చి చివరి నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మన ఊరు మనబడికి సంబంధించి తుది దశకు చేరిన పాఠశాల భవనాలను గుర్తించి వాటిని వేగంగా వాడుకలోకి తెచ్చేలా నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.
Similar News
News November 2, 2025
ఆ ఓటర్లను ‘స్థానిక’ జాబితాలో చేర్చండి: SEC

TG: రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికల కసరత్తులో భాగంగా GP వార్డుల వారీగా కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని కలెక్టర్లను SEC ఆదేశించింది. గతనెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి, కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించే నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఈనెల 15 వరకు నమోదయ్యే ఓటర్లను లోకల్ బాడీ ఎలక్షన్స్ ఓట్ లిస్ట్‌లో చేర్చాలని సూచించింది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ముందుజాగ్రత్తగా సిద్ధం చేయాలని ఆదేశించింది.
News November 2, 2025
5న భువనగిరిలో ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు

ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన భువనగిరిలో ఉమ్మడి జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ ఆర్చరీ సెలక్షన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ఆధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, తునికి విజయ సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. సెలక్షన్ పోటీల్లో పాల్గొనదల్చిన క్రీడాకారులు ఆయా పాఠశాల నుంచి తమ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకు చేరుకోవాలని కోరారు.
News November 2, 2025
HYD: చంచల్‌గూడ జైలుకు ఒమర్ అన్సారీ

HYDలోని చాదర్‌ఘాట్ పరిధిలో గల విక్టోరియా ప్లే గ్రౌండ్లో గత శనివారం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిందితుడు ఒమర్ అన్సారీ కోలుకోవడంతో శనివారం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించడంతో అతడిని చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు.


