News March 22, 2025

వనపర్తి: పెండింగ్‌ నిర్మాణ పనులు పూర్తి చేయండి: కలెక్టర్

image

వనపర్తి జిల్లాలో వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను మార్చి చివరి నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మన ఊరు మనబడికి సంబంధించి తుది దశకు చేరిన పాఠశాల భవనాలను గుర్తించి వాటిని వేగంగా వాడుకలోకి తెచ్చేలా నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.

Similar News

News April 21, 2025

అగ్నివీర్‌కు ఎంపికైన కొండంరాజపల్లి యువకుడు

image

నంగునూరు మండలం కొండంరాజపల్లి గ్రామానికి చెందిన తిరుపతి- లక్ష్మీ దంపతుల కుమారుడు బండి శ్రీనివాస్ అగ్నివీర్‌కు ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు కూలీలు కాగా, అగ్నివీర్‌కు ఎంపిక కావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్‌కు బంధువులు, గ్రామస్థులు, మిత్రులు అభినందనలు తెలిపారు.

News April 21, 2025

గిన్నిస్ బుక్ అవార్డు పొందిన సత్తెనపల్లి యువతి

image

సత్తెనపల్లి యువతికి గిన్నిస్ బుక్ అవార్డ్ దక్కింది. పాపిశెట్టి అనూష 1,046 మంది విద్యార్థులతో గంటపాటు స్వరాలు వాయించినందుకు ఈ అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని లైఫ్ చర్చిలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ ఘనత సాధించిన అనూషను పలువురు అభినందిస్తున్నారు.

News April 21, 2025

అనేక భాషలకు పుట్టినిల్లు ఉమ్మడి ఆదిలాబాద్

image

ADB తెలంగాణ కశ్మీర్‌‌‌గా ప్రసిద్ధి. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఇక్కడ ఎండా, వాన, చలి అన్నీ ఎక్కువే. అంతేకాదండోయ్.. ఎన్నో భాషలకు పుట్టినిల్లు కూడా. తెలుగు ప్రజలు అధికంగా ఉన్నా ఉర్దూ, హిందీ మాట్లాడుతారు. MHకి సరిహద్దులో ఉండడంతో మరాఠీ, ఆదివాసీల గోండు, కొలాం, గిరిజనుల లంబాడీ, మథుర భాషలు ప్రత్యేకం. అందరూ కలిసి ఉండడంతో ఒక భాషలో పదాలు మరో భాషలో విరివిరిగా ఉపయోగిస్తుంటారు. మీదే భాషనో కామెంట్ చేయండి.

error: Content is protected !!