News February 21, 2025
వనపర్తి: పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు!

ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని మృతి చెందిన ఘటన వీపనగండ్ల మండలంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. బొల్లారానికి చెందిన శ్రీనివాస్ గౌడ్(50) భార్య పిల్లలతో కలిసి MBNRలో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం బంధువు ఒకరు చనిపోవటంతో శ్రీనివాస్ గ్రామానికి వచ్చారు. కాగా.. కొన్నిరోజులుగా కుటుంబ కలహాలతో విరక్తి చెంది తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి నిప్పంటిచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News December 13, 2025
నరసాపురంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

నరసాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను జిల్లా అదనపు న్యాయమూర్తి వాసంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ..కేసులు పరిష్కారంలో రాజీయే రాజమార్గమన్నారు. దీనివల్ల కక్షలు పెరగవని కోట్లు చుట్టూ చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృథా చేసుకోవలసిన అవసరం ఉండదు అన్నారు.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
మంత్రి సంధ్యారాణిని కలిసిన మన్యం డీఈవో

పార్వతీపురం మన్యం జిల్లా డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన పి.బ్రహ్మాజీరావు శనివారం మంత్రి సంధ్యారాణిని సాలూరు క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవంతో జిల్లాను విద్యారంగంలో మరింత ప్రగతి సాధించేలా కృషి చేయాలని మంత్రి సంధ్యారాణి సూచించారు. వీరితో పాటు డిప్యూటీ డీఈవో రాజ్ కుమార్ మంత్రిని కలిశారు.


