News March 22, 2025

వనపర్తి: పెబ్బేర్‌లో యాక్సిడెంట్.. రేషన్ డీలర్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో రేషన్ డీలర్ మృతిచెందిన ఘటన పెబ్బేర్ పరిధి అంబేడ్కర్ నగర్ రోడ్డు దగ్గర శుక్రవారం జరిగింది. SI హరిప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాలు.. చెలిమిళ్లకు చెందిన రేషన్ డీలర్ హనుమంతు కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో వనపర్తి నుంచి పెబ్బేర్‌కు చేరుకుని బస్సు దిగే క్రమంలో కిందపడి మృతిచెందాడు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News September 13, 2025

మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత: ప.గో కలెక్టర్

image

జిల్లాలో మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవారంలోని కలెక్టరేట్‌లో మాట్లాడారు. ‘స్వస్థ నారి – శసక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు, వైద్య నిపుణుల సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.

News September 13, 2025

గుంటూరు: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్

image

గుంటూరు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. సహాయం కోసం 0863-2234014 నంబరులో సంప్రదించాలన్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని విధులు నిర్వహించేలా నియమించామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు సమస్యలు తెలియజేస్తే అధికారులు వెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

News September 13, 2025

విశాఖలో 15 రోజులపాటు HIV/AIDSపై అవగాహన

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 15 రోజులపాటు విశాఖ జిల్లా పాఠశాలల్లో విద్యార్థులకు HIV/AIDS, లైంగిక వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఐఈసీ కాంపెయిన్ల ద్వారా జాగ్రత్తలు, చికిత్సా అవకాశాలు, గర్భిణులకు కౌన్సెలింగ్, హెల్ప్‌లైన్ 1097 సేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎ.నాగేశ్వరరావు తెలిపారు.