News March 30, 2025
వనపర్తి: పెబ్బేర్‌లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలో కింది విధంగా నమోదయ్యాయి. అత్యధికంగా అమరచింత, పెబ్బేరులో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దగడ 41.2, శ్రీరంగాపూర్ 41.2, ఆత్మకూరు 41.2, వెలుగొండ 41.2, కేతపల్లి 40.9, రేమోద్దుల 40.9, రేవల్లి 40.8, పెద్దమందడి 40.7, జానంపేట 40.7, వీపనగండ్ల 40.7, వనపర్తి 40.5, గోపాల్పేట 40.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News December 5, 2025
సికింద్రాబాద్: ‘పుష్ప’ స్టైల్లో హవాలా డబ్బు రవాణా

సికింద్రాబాద్‌లో ‘పుష్ప’ సినిమా స్టైల్లో హవాలా డబ్బు రవాణా చేస్తున్నారు. దీంతో 15 కిలోమీటర్లు బోయిన్పల్లి పోలీసులు సాహసోపేతంగా ఛేజ్ చేసి ముఠాను అడ్డగించారు. కార్ డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో దాచిన భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఛేజ్ చేసి పట్టుకున్న ఈ హవాలా గ్యాంగ్ రూ.కోట్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 5, 2025
తిరుమల దర్శనం టికెట్లు.. భక్తులకు గమనిక

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే 10రోజులు SSD(తిరుపతిలో ఇస్తున్న టైం స్లాట్) టోకెన్లు జారీ చేయరు. తొలి 3రోజులు ఆన్లైన్ టోకెన్లు ఉన్నవారినే అనుమతిస్తారు. తర్వాత నుంచి వచ్చే వారంతా నేరుగా కొండకు వచ్చి వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 నుంచి దర్శనానికి వెళ్లవచ్చు. జనవరి 2నుంచి 8వ తేదీ వరకు శ్రీవాణి టికెట్లను ఇవాళ ఉదయం 10గంటలకు రిలీజ్ చేయగా.. SED(రూ.300) టిక్కెట్లు ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు విడుదల కానున్నాయి.
News December 5, 2025
రాజోలి: MA ఎకనామిక్స్ చదివి సర్పంచ్‌కు పోటీ..!

రాజోలి మండలంలోని పెద్దధన్వాడ గ్రామపంచాయతీ జనరల్ మహిళాకు రిజర్వ్ అయింది. నారాయణమ్మ M.A ఎకనామిక్స్ చదివి గద్వాల జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని పనిచేస్తోంది. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గ్రామ సర్పంచ్ పదవికి నామపత్రాలు సమర్పించినట్లు Way2News కు తెలిపారు.


