News April 15, 2025
వనపర్తి: పోక్సో యాక్ట్పై అవగాహన

రాజ్యాంగం మనకు అనేక రకాలైన హక్కులను కల్పిస్తుందని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ ఉత్తరయ్య అన్నారు. వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని సూచన మేరకు సోమవారం వనపర్తి, పెద్దమందడి మండలాల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోక్సో యాక్ట్, బాల్య వివాహాలు, మోటార్ వెహికల్ యాక్ట్పై ఆయన అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.
Similar News
News December 4, 2025
ఉమ్మడి వరంగల్లో 130 ఏళ్ల పంచాయతీరాజ్ ప్రస్థానం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థ 130 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. HYD పంచాయతీ చట్టం నుంచి మొదలైన ఈ ప్రయాణంలో అశోక్ మెహతా కమిటీ సిఫార్సులు, మండల వ్యవస్థ ఏర్పాటుతో పంచాయతీలు బలోపేతం అయ్యాయి. తండాలకు పంచాయతీ హోదా లభించడంతో జీపీల సంఖ్య 567 నుంచి 1708కి పెరిగింది. ఈ వ్యవస్థ ద్వారానే అనేకమంది నాయకులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగారు.
News December 4, 2025
ఈ అలవాట్లతో సంతోషం, ఆరోగ్యం!

చిన్న చిన్న అలవాట్లే మంచి ఆరోగ్యం, సంతోషానికి కారణమవుతాయని న్యూరాలజిస్ట్ సుధీర్ కుమార్ చెబుతున్నారు. ఉదయాన్నే సూర్యకాంతిలో ఉండటం, రోజువారీ నడక, మంచి నిద్ర, శ్రద్ధతో తినడం, మిమ్మల్ని కేర్ చేసే వారితో మాట్లాడటం, 2 నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్, దయతో వ్యవహరించాలని తెలిపారు. రాత్రి వేళల్లో స్క్రీన్ చూడటం తగ్గించడం, హైడ్రేటేడ్గా ఉండటం, రోజూ కొత్తవి నేర్చుకోవడం అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.
News December 4, 2025
HYD సీపీ ఎమోషనల్ పోస్ట్

డబ్బు మత్తులో.. బంధాలు ఛిద్రం అవుతున్నాయని నగర సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగులో రూ.4 కోట్లకు బీమా చేయించి అన్నను తమ్ముడు ఘోరంగా హతమార్చాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దీనిపై సజ్జనార్ స్పందించారు. ‘ఏ బ్యాంక్ బ్యాలెన్స్ గుండె చప్పుడును కొనలేదు. ఏ బీమా పాలసీ పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేదు’ అని పేర్కొన్నారు.


