News April 5, 2025
వనపర్తి పోలీసులు భేష్: డీజీపీ

రాష్ట్రంలో శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తున్నామని డీజీపీ జితేందర్ అన్నారు. శుక్రవారం వనపర్తిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తి జిల్లా పరిధిలో పోలీస్ అధికారులు, సిబ్బంది శాంతి భద్రతల గురించి అద్భుతంగా పనిచేస్తున్నారని తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం అందించడానికి పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు.
Similar News
News April 21, 2025
రాహుల్ ద్వంద్వ పౌరసత్వం కేసు.. కేంద్రానికి హైకోర్టు కీలక ఆదేశాలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కేసులో కేంద్ర హోంశాఖకు అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల్లో ఆయన పౌరసత్వంపై తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉందని, దీంతో భారత్‌లో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.
News April 21, 2025
మే రెండో వారంలో ‘హరిహర వీరమల్లు’ రిలీజ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్. ఆయన నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’, ‘OG’ సినిమాల విడుదలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. HHVM వచ్చే నెల రెండు లేదా మూడో వారంలో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈలోగా మిగిలిన చిత్రీకరణతో పాటు డబ్బింగ్ పనులు పూర్తి చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నాయి.
News April 21, 2025
భూ భారతి చట్టం రైతులకు భద్రత: కలెక్టర్

భూభారతి చట్టంతో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులకు ఈ చట్టం భద్రతగా ఉంటుందని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం అలంపూర్ పట్టణంలో ఓ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. భూ భారతి చట్టం వల్ల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.