News March 22, 2025
వనపర్తి: ప్రతి ఒక్క దివ్యాంగుడికి యూనిక్ డిజేబుల్ ఐడీ: కలెక్టర్

ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు ఉండాలని ప్రభుత్వం యూనిక్ డిజేబుల్ ఐడీని అమల్లోకి తీసుకొచ్చిందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యూనిక్ డిజేబుల్ ఐడీ అంశంపై ఎంపీడీవోలు, మీసేవ ఆపరేటర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. యూడీఐడీ కార్డు కోసం దివ్యాంగులు ఆన్లైన్ (www.swavlambancard.gov.in) ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.
Similar News
News July 6, 2025
మస్క్ కొత్త పార్టీతో ట్రంప్‌నకు నష్టమేనా?

ఎలాన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ స్థాపించడం రిపబ్లిక్, డెమొక్రాటిక్ పార్టీలకు నష్టం చేకూర్చే అవకాశముంది. ముఖ్యంగా ట్రంప్‌నకు తలనొప్పి తీసుకురావొచ్చు. మస్క్ అపర కుబేరుడు, ఒక గొప్ప వ్యాపారవేత్త, ఒక్క ట్వీటుతో లక్షల మందిని ప్రభావితం చేయగల ఇన్‌ఫ్లుఎన్సర్. పైగా ‘మేక్ అమెరికా.. అమెరికా అగైన్’, ప్రజలకు స్వేచ్ఛనిప్పిస్తా అంటున్నారు. అయితే USలో 3 పార్టీల విధానం వర్కౌట్ అవ్వదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
News July 6, 2025
ఖమ్మం శ్రీలక్ష్మీ రంగనాథ ఆలయంలో ఏకాదశి వేడుకలు

ఖమ్మం రంగనాయకుల గుట్టపై స్వయంభు కరిగిరి శ్రీలక్ష్మీ రంగనాథస్వామి వారి దేవస్థానంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు బూరుగడ్డ శ్రీధరాచార్యులు తెలిపారు. తెల్లవారుజామున 5:30 గంటలకు ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకం, సువర్ణపుష్పార్చన, ఉదయం 9:30కు సుదర్శన హోమం, మధ్యాహ్నం 12 గంటలకు మహా పూర్ణాహుతి ఉంటుందని, భక్తులు సకాలంలో హాజరై, స్వామివారి ఆశీస్సులు పొందాలని సూచించారు.
News July 6, 2025
జాతీయ స్థాయి హాకీ పోటీలకు ధర్మవరం క్రీడాకారుల ఎంపిక

జార్ఖండ్ రాజధాని రాంచిలో జరుగుతున్న 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ మహిళల హాకీ పోటీలలో రాష్ట్ర జట్టుకు ధర్మవరానికి చెందిన మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా జనరల్ సెక్రటరీ బి.సూర్యప్రకాష్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు జరిగే హాకీ పోటీలలో రాష్ట్ర జట్టు తరఫున మధురిమా భాయ్, వైష్ణవి, వర్ష పాల్గొంటారన్నారు. కేరళ రాష్ట్ర జట్టుకు తలారి హేమ ఎంపికయ్యారని పేర్కొన్నారు. క్రీడాకారులను అభినందించారు.