News January 28, 2025
వనపర్తి: ప్రభుత్వ ఖజానాకు తగ్గిన భారం రూ.5.12 కోట్లు

వనపర్తి జిల్లాలో సాగుకు పనికిరాని భూములను వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు గుర్తించారు. మొత్తం 15 మండలాల్లో సర్వే ద్వారా మొత్తం 4269.84 ఎకరాల భూములు సాగుకు పనికి రావని అధికారులు లెక్కలు తేల్చారు. ఈ భూములకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎకరాకు ఇచ్చే రైతు భరోసా రూ.12 వేలు వర్తించదు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.5.12 కోట్ల భారం తగ్గనుంది.
Similar News
News November 21, 2025
బిహార్ ఎన్నికలపై ఆరోపణలు.. ECI వివరణ ఇవ్వాలని డిమాండ్!

బిహార్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ లెక్కలు సరిపోలడం లేదని పొలిటికల్ ఎకనామిస్ట్ పి.ప్రభాకర్ ఆరోపించారు. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్లో 1,77,673 ఓట్లు ఎక్కువగా వచ్చాయని Xలో <
News November 21, 2025
జర్నలిస్ట్లు అక్రిడేషన్కు దరఖాస్తు చేసుకోవాలి : DIPRO

2026 – 2027 సంవత్సరానికి గాను అక్రిడేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు DIPRO, I&PR కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. https://mediarelations.ap.gov.in/media/#/home/index లింకు ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిపోర్టర్ తమ పేరు, హోదా, మెయిల్ అడ్రస్, ఆధార్ నెంబరు, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ నమోదు చేసి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ కావాలన్నారు. పూర్తి వివరాలతో దరఖాస్తును ఆన్లైన్ ద్వారా పంపించాలన్నారు.
News November 21, 2025
NZB: హమారా ‘నిఖత్’ హ్యాట్రిక్ విన్నర్

గ్రేటర్ నోయిడాలో గురువారం జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. నిఖత్ 51 కేజీల విభాగంలో తైవాన్ క్రీడాకారిణిపై 5-0తో గెలిచింది. దీంతో వరుసగా 3 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లలో గోల్డ్ మెడల్ సాధించింది. 2022, 2023, 2025 సంవత్సరాల్లో జరిగిన టోర్నీల్లో బంగారు పతకం గెలుపొందింది. 2024లో ఒలింపిక్ క్రీడల వల్ల ఈ టోర్నీలు జరగ లేదు.


