News April 6, 2025

వనపర్తి: ప్రభుత్వ వైఫల్యాలపై సమరం: నిరంజన్ రెడ్డి

image

BRS పార్టీ ఆవిర్భావ రజితోత్సవ మహాసభ నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో కలిసి మాజీమంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. హామీలను అమలు చేయకుండా ప్రజాసంక్షేమం, అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై BRS ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని నిరంజన్ రెడ్డి తెలిపారు.

Similar News

News November 25, 2025

కోకో తోటల్లో కొమ్మ కత్తిరింపులు – లాభాలు

image

కోకో తోటల్లో రెండేళ్ల వరకు మొక్క సింగిల్ కొమ్మతో పెరిగేలా చూడాలి. పంట నాటిన మూడేళ్ల తర్వాత కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. మే 15 – జులై 15లోపు ప్రధాన కొమ్మలను కత్తిరించాలి. దీని వల్ల SEP,OCT,NOV నెలల్లో పూత బాగా వస్తుంది. నేలను చూసే కొమ్మలను, నేల నుంచి 3 అడుగుల వరకు కొమ్మలు లేకుండా కత్తిరించాలి. పదేళ్లు దాటిన తోటల్లో చెట్లు 7 అడుగులలోపే ఉండేలా చూడాలి. దీని వల్ల కాయ పెరుగుదల బాగుంటుంది.

News November 25, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేడు మంగళవారం బంగారం వెండి ధరలు వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్లు 1 గ్రాము: రూ.12590
☛ బంగారం 22 క్యారెట్లు 1 గ్రాము: రూ.11583
☛ వెండి 10 గ్రాములు రూ.1616
ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేడు మంగళవారం బంగారం వెండి ధరలు వివరాలు:

News November 25, 2025

లేటెస్ట్ అప్డేట్స్

image

* TG సచివాలయంలో ప్రారంభమైన క్యాబినెట్ భేటీ.. పంచాయతీ ఎన్నికల సన్నద్ధత, విద్యుత్ శాఖ సంబంధిత అంశాలపై చర్చ
* స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో మ.2.15కు విచారణ
* మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్న వైసీపీ చీఫ్ జగన్.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు క్యాంప్ ఆఫీసుకు రాక
* నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్, రాము, జనార్దన్ రావుతో పాటు నలుగురికి డిసెంబర్ 9 వరకు రిమాండ్ పొడిగింపు