News January 28, 2025
వనపర్తి: ప్రయోగ పరీక్షలకు 41 కేంద్రాల ఏర్పాటు

వనపర్తి జిల్లాలో వచ్చేనెల 3 నుంచి జరిగే ఇంటర్ వార్షిక ప్రయోగ పరీక్షలకు అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధారణ విభాగం, వృత్తి విద్యా విభాగంలో మొత్తం 6,591 మంది విద్యార్థులు ప్రయోగ పరీక్షలకు హాజరుకానున్నారని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.
Similar News
News February 16, 2025
తాడ్వాయి: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామానికి చెందిన చిందం మల్లయ్య(48) అనే వ్యక్తి శనివారం ఉదయం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మల్లయ్య బందువుల పెళ్లి ఉండటంతో చెట్టు కొమ్మలు కొడుతుండగా కొమ్మ విరిగి పక్కనే ఉన్న కరెంట్ లైన్ తీగలపై పడడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మల్లయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News February 16, 2025
మెదక్: గంజాయి మత్తు పదార్థాల బారీన పడకుండా చర్యలు: కలెక్టర్

రేపటి సమాజ నిర్మాతలైన యువత డ్రగ్ మహమ్మారి బారీన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన నార్కోటిక్ కో-ఆర్డినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ జిల్లా ఎస్పీ పాల్గొని పలు అంశాలపై సూచనలు చేశారు. యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.
News February 16, 2025
ADB: బాబా మాటలు నమ్మి మోసపోయిన వ్యక్తి

బాబా మాటలు నమ్మి ఒక వ్యక్తి మోసపోయిన ఘటన ADBలో జరిగింది. CI కరుణాకర్ కథనం ప్రకారం.. ఖుర్షీద్ నగర్‌కు చెందిన అజహర్ ఉద్దీన్‌కు మహారాష్ట్రకు చెందిన యాసీన్(జనబ్ డోంగీబాబా) పరిచయమయ్యాడు. ఆయన అజహర్‌కు మాయమాటలు చెప్పి తన వద్ద తాయత్తు తీసుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మించాడు. అయితే తాయత్తు తీసుకున్న అనంతరం ఇంట్లో గొడవలు ప్రారంభం కావడంతో తనను బాబా మోసం చేశాడంటూ టూటౌన్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.