News February 18, 2025
వనపర్తి: బాలిక ఆత్మహత్యాయత్నం

ఖిల్లాఘనపూర్ మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక(15) తాను చదువుతున్న కేజీబీవీ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సిబ్బంది తెలిపిన వివరాలిలా.. బాలిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం ప్రార్థన సమయంలో బాలిక హాజరుకాకపోవటాన్ని సిబ్బంది గమనించారు. తరగతి గదిలో బాలిక జ్వర మాత్రలు మింగి ఉండటాన్ని చూసి ఇన్ఛార్జ్ ఎస్ఓ ప్రశాంతికి సమాచారం అందించారు. వెంటనే వీపనగండ్లలోని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 28, 2025
WPL మెగా వేలం: తెలుగు ప్లేయర్ల హవా

WPL మెగా వేలంలో తెలుగు ప్లేయర్లను అదృష్టం వరించింది. కరీంనగర్(D) రామగుండంకు చెందిన శిఖా పాండే(ఆల్ రౌండర్)కు అనూహ్య ధర దక్కింది. జాతీయ జట్టులో చోటు కోల్పోయినా ఆమెను UP రూ.2.4కోట్లకు కొనుగోలు చేసింది. లేటెస్ట్ వరల్డ్ కప్ సెన్సేషన్ శ్రీచరణి రూ.1.30కోట్లకు DC సొంతం చేసుకుంది. అరుంధతిరెడ్డిని రూ.75లక్షలకు RCB, త్రిష UP, క్రాంతిరెడ్డి MI, మమత కోసం DC రూ.10 లక్షల చొప్పున వెచ్చించాయి.
News November 28, 2025
నేడు అఖండ-2 ప్రీరిలీజ్ ఈవెంట్

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ-2పై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానుండగా, మూవీ టీం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇవాళ HYDలోని కూకట్‌పల్లిలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ‘అఖండ’ చిత్రం ఉత్తరాదిలోనూ మంచి విజయం సాధించడంతో ఈ సీక్వెల్‌పై హిందీ రాష్ట్రాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
News November 28, 2025
పంట నష్టం నివారణ చర్చలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

ఏలూరు జిలాల్లో ఈనెల 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల దృష్ట్యా ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. పంట నష్టం నివారణ చర్యలపై అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు. ప్రస్తుతం కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.


