News February 18, 2025

వనపర్తి: బాలిక ఆత్మహత్యాయత్నం

image

ఖిల్లాఘనపూర్ మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక(15) తాను చదువుతున్న కేజీబీవీ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సిబ్బంది తెలిపిన వివరాలిలా.. బాలిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం ప్రార్థన సమయంలో బాలిక హాజరుకాకపోవటాన్ని సిబ్బంది గమనించారు. తరగతి గదిలో బాలిక జ్వర మాత్రలు మింగి ఉండటాన్ని చూసి ఇన్‌ఛార్జ్ ఎస్ఓ ప్రశాంతికి సమాచారం అందించారు. వెంటనే వీపనగండ్లలోని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 6, 2026

నిర్మల్ జిల్లాలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత

image

నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలలో నమోదు కావాల్సిన గరిష్ట ఉష్ణోగ్రతలు మార్చిలోనే నమోదు అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో శుక్రవారం 38.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత భైంసా మండలంలో నమోదు కాగా, అత్యల్పంగా కుంటాలలో 14.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 6, 2026

ఎస్సీ వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది: సీఎం రేవంత్

image

TG: సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత SC వర్గీకరణపై ప్రకటన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని CM రేవంత్ చెప్పారు. HYDలో మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మీవైపే నిలబడ్డాను. భారతంలో నా ఫేవరెట్ క్యారెక్టర్స్ కర్ణుడు, బర్బరీకుడు. కర్ణుడి మాదిరిగా మాదిగల విషయంలో మిత్ర ధర్మం పాటిస్తూ బర్బరీకుడిలా పనిచేశా’ అని తెలిపారు.

News March 6, 2026

UPDATE: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

<<19312594>>బైక్‌ను టిప్పర్<<>> ఢీకొన్న ఘటనలో చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చిలుక ప్రదీప్ కుమార్, తాటికొండ సాయి కిరణ్ మృతి చెందారు. శుక్రవారం ఈ ఇద్దరు మిత్రులు బైక్‌పై వెళుతుండగా చాకుంట ఎక్స్ రోడ్డు వద్ద అతి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరి యువకుల తలలు నుజ్జునుజ్జు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.