News April 3, 2025
వనపర్తి బిడ్డ అనూష తగ్గేదేలే..!

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అనకాయపల్లి పంచాయతీ పరిధి పిల్లిగుండ్ల తండాకు చెందిన ఇస్లావత్ అనూష వికారాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్ విభాగంలో ఎంపికై, బిహార్లో జరిగిన జాతీయ కబడ్డీ పోటీల్లో ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తిలో అనూషను శాలువాతో సత్కరించి అభినందించి మాట్లాడారు. గ్రామీణ విద్యార్థులకు అనూష స్ఫూర్తి కావాలన్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.
Similar News
News December 1, 2025
సిరిసిల్ల: ‘బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం’

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి 27 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
News December 1, 2025
ఉద్యోగుల బేసిక్ PAYలో 50% DA మెర్జ్? కేంద్రం సమాధానమిదే

ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేలో DA నుంచి కొంత మొత్తాన్ని మెర్జ్ చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. 50% DAను వెంటనే బేసిక్ పేలో కలపాలని ఇటీవల ఉద్యోగ సంఘాలు లేఖ రాసిన నేపథ్యంలో లోక్సభలో సమాధానమిచ్చింది. కాగా ఒకవేళ బేసిక్ PAYలో 50% డీఏ కలిస్తే ఎంట్రీ లెవల్ బేసిక్ పే ₹18వేల నుంచి ₹27వేలకి పెరగనుంది. అటు 8th పే కమిషన్ 2027లోగా అమల్లోకి వచ్చే అవకాశం కనిపించట్లేదు.
News December 1, 2025
సిరిసిల్ల: ‘1,98,426 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం’

సిరిసిల్ల జిల్లాలో 1,98,426 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. మొత్తం జిల్లాలోని 239 కొనుగోలు కేంద్రాల ద్వారా 32,085 మంది రైతుల నుంచి 1,98,426 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలో వెంటనే డబ్బు జమ చేయాలని ఆమె ఆదేశించారు.


