News January 17, 2025

వనపర్తి: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYDలోని అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. వనపర్తి(D) పెద్దగూడెంకు చెందిన భానుప్రకాశ్ ఓ కళాశాలలో బీటెక్ 1st ఇయర్ చదువుతూ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజామున హాస్టల్ భవనంపై ఉరేసుకున్నాడు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేశారు. అమ్మానాన్నలకు నోట్ బుక్‌లో లేఖను రాసినట్లు తెలుస్తోంది.

Similar News

News December 27, 2025

మహబూబ్‌నగర్: ఈనెల 29న మహిళల క్రికెట్ జట్టు ఎంపిక

image

పాలమూరు విశ్వవిద్యాలయం మహిళల క్రికెట్ జట్టు ఎంపికలు ఈ నెల 29న నిర్వహించనున్నట్లు వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాసులు శనివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు (17-25 ఏళ్ల వారు) ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్‌ కార్డులతో హాజరుకావాలని సూచించారు.

News December 27, 2025

MBNR: కోర్టు భవన నిర్మాణానికి భూమిపూజ

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి సమీపంలో జిల్లా కోర్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ భూమిపూజ చేశారు. పండితులు వేదమంత్రాలు పఠిస్తూ కార్యక్రమం నిర్వహించారు. వారితోపాటు జిల్లా సెషన్ న్యాయమూర్తి ప్రేమలత, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి తదితరులు పాల్గొన్నారు.

News December 27, 2025

MBNR:GET READY.. సాఫ్ట్ బాల్ జట్టు సిద్ధం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ సాఫ్ట్ బాల్ బాలికల జట్టు రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమైంది. మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగే అండర్-19 SGF సాఫ్ట్ బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు బయలుదేరింది. విజేతగా నిలవాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) కార్యదర్శి డాక్టర్ శారదాబాయి ఆకాంక్షించారు. ఈనెల 28 వరకు పోటీలు జరగనున్నాయి. పీడీలు వేణుగోపాల్, సరిత, నాగరాజు, లక్ష్మీనారాయణ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.