News May 25, 2024

వనపర్తి: బైక్ అదుపుతప్పి ఒకరి మృతి

image

వనపర్తి జిల్లాలో ఇవాళ సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం.. ఇద్దరు బైక్‌పై గొల్లపల్లి నుంచి ఆదిరాల వెళ్తుండగా ఏదుల గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే వనపర్తి ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 17, 2025

NRPTలో అనుమానాస్పద స్థితిలో చిరుత మరణాలు.!

image

NRPT జిల్లాలో వేల ఎకరాలలో ఫారెస్ట్ విస్తరించి ఉంది. ఈమధ్య కాలంలో వన్యప్రాణుల సంతతి పెరుగుతోందని సంతోషించే లోపే చిరుతల అనుమానాస్పద మృతి ఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయి. మద్దూరు, దామరగిద్ద మండలాల్లో ఇటీవల ఐదు చిరుత పులులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. జాదరావుపల్లి, నందిపాడు ఉడుమల్గిద్ద, కంసాన్ పల్లి, వారం క్రితం ఉడ్మల్‌గిద్దలో నిన్న మోమినాపూర్‌లో అనుమానాస్పదంగా చిరుతలు మృత్యువాత పడ్డాయి.

News February 17, 2025

HAPPY BIRTHDAY KCR: CM రేవంత్ రెడ్డి

image

గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కాసేపటి క్రితం ఇందుకు సంబంధించిన ఫొటోను తెలంగాణ CMO ట్వీట్ చేసింది.

News February 17, 2025

MBNR: వాహనం ఢీకొని యువకుడి మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన మిడ్జిల్ మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఎస్సై శివనాగేశ్వర్‌నాయుడు తెలిపిన వివరాలు.. తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌కి చెందిన సోప్పరి రాఘవేందర్ మిడ్జిల్ మండలం చిల్వేర్‌లో పెళ్లికి వెళ్లి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు మృతదేహాన్ని జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. మృతుడికి 10 నెలల క్రితమే పెళ్లయిందని స్థానికులు తెలిపారు.

error: Content is protected !!