News April 17, 2025

వనపర్తి: బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే మిల్లర్లకే యాసంగి వరి ధాన్యం: డీఎస్ చౌహాన్

image

మిల్లర్లు ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన ధాన్యం క్లియర్ చేసి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే మిల్లర్లకే యాసంగి వరి ధాన్యం కేటాయించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్. చౌహాన్ స్పష్టం చేశారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ అప్పగింతపై గురువారం అదనపు కలెక్టర్లు రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఇందులో వనపర్తి జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Similar News

News December 19, 2025

నెల్లూరు: కారుణ్య నియామక పత్రాలు అందజేత

image

విధి నిర్వహణలో ఉంటూ మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. జి. భాగ్యమ్మను ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో కుక్ గా, టి. పవన్ ను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ భరోసానిచ్చారు.

News December 19, 2025

సూర్యాపేట: ఈనెల 22న జిల్లాలో విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్

image

ప్రజలకు విపత్తు సమయంలో అవసరమైన సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడారు.జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 22న మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వరదలు, పరిశ్రమ, రహదారి ప్రమాదాల సమయంలో ప్రజలను రక్షించడం,ఉపశమన శిబిరాలు ఏర్పాటు చేయడం,వైద్య, అగ్నిమాపక, పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేయడం ముఖ్యమన్నారు.

News December 19, 2025

వాస్తు ప్లాన్లలో ఉత్తర దిశ ప్రాధాన్యత

image

వాస్తుశాస్త్రంలో తూర్పు దిశకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఇంటి లేఅవుట్లలో ఉత్తర దిశనే ప్రామాణికంగా గుర్తిస్తారు. దీనికి ప్రధాన కారణం ఉత్తర దిశ నుంచి నిరంతరం ప్రవహించే అయస్కాంత తరంగాలేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘పంచభూతాల సమన్వయానికి ఈ దిశ దిక్సూచిలా పనిచేస్తుంది. వినాయక వృత్తాంతంలోనూ ఉత్తర దిశ విశిష్టత గురించి ఉంది. అందుకే ప్లాన్లలో దిశల స్పష్టత కోసం ఉత్తరాన్ని వాడుతారు. <<-se>>#Vasthu<<>>