News March 29, 2025
వనపర్తి: భాగస్వామికి వృద్ధాప్య పెన్షన్: కలెక్టర్

వృద్ధాప్య పెన్షన్ పొందుతూ చనిపోయిన వారి స్థానంలో జీవించి ఉన్న వారి భాగస్వామికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ ఆదేశించారు. జిల్లాలో 451 మంది మరణించిన వృద్ధాప్య పెన్షన్ కేసులు పెండింగ్లో ఉన్నాయని, గ్రామంవారిగా వారి వివరాలు సేకరించి, మరణధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, భాగస్వామి బ్యాంక్ ఖాతా ఎంపీడీవో కార్యాలయంలో అందిస్తే ఏప్రిల్ 10 లోగా వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేస్తామన్నారు.
Similar News
News October 20, 2025
PGIMERలో ఉద్యోగాలు

చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(PGIMER)లో 4 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఈ నెల 30 ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS/BDSతో పీహెచ్డీ, ఎంఎస్సీ నర్సింగ్, MD/MS, GNM, ఇంటర్, డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://pgimer.edu.in/
News October 20, 2025
SKLM: డిగ్రీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల

శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైది. ఈ మేరకు యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల విభాగం అధికారి జి.పద్మారావు ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఈనెల 31వ తేదీ లోపు పరీక్ష ఫీజును యూనివర్సిటీ లేదా కాలేజీల్లో చెల్లించాలని సూచించారు. పరీక్షలు నవంబర్ 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని చెప్పారు.
News October 20, 2025
దీపావళి శాంతియుతంగా జరుపుకోవాలి: ASF SP

దీపావళి వెలుగుల పండుగగా ప్రతి ఇంటిలో ఆనందం, ఐకమత్యం, సంతోషం నిండాలని ఆకాంక్షించారు. గిరిజనుల సాంప్రదాయ పండుగ దండారి గుస్సాడి సందర్భంగా గిరిజన సోదరులు, కళాకారులకు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ పండుగలను శాంతి, ఐకమత్యం, సోదరభావంతో జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.