News January 30, 2025
వనపర్తి: భారీ కొండచిలువ పట్టివేత

వనపర్తి మండలం కాశీంనగర్ సమీపంలో ఎర్రగట్టు తండాకు కూతవేటు దూరంలోని వ్యవసాయ పొలంలో సుమారు 11 ఫీట్ల కొండచిలువ బుధవారం రైతుల కంటపడింది. భయపడిన రైతులు, కూలీలు గట్టిగా కేకలు పెట్టారు. వెంటనే స్నేక్స్ సొసైటీ టీంకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకొని పంటలకు రక్షణగా రైతులు ఏర్పాటు చేసిన వలకు చిక్కిన సుమారు 18కిలోల కొండచిలువను పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి అడవిలో వదిలేశారు.
Similar News
News November 18, 2025
రేపు పుట్టపర్తికి వస్తున్నా: PM మోదీ

సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు తాను రేపు పుట్టపర్తికి వస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మికత కోసం బాబా చేసిన కృషి తరతరాలకు మార్గదర్శకమని ప్రధాని పేర్కొన్నారు. గతంలో బాబాతో తనకు అనేక సందర్భాల్లో సంభాషించే అవకాశం లభించిందని, ఆ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
News November 18, 2025
కామారెడ్డి: ఇళ్ల లక్ష్యాలు పకడ్బందీగా సాధించాలి: కలెక్టర్

కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాచారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట్ మండలాల ఎంపీడీవోలతో జరిగిన ఈ సమావేశంలో.. మండలాల వారీగా నిర్మాణాల పురోగతిని తెలుసుకున్నారు. లక్ష్యాలను వంద శాతం చేరుకునేలా ప్రత్యేక చొరవ తీసుకుని, పనులను వేగవంతం చేయాలని ఎంపీడీవోలకు కలెక్టర్ సూచించారు.
News November 18, 2025
సిరిసిల్లలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

రాజన్న జిల్లా జిన్నింగ్ మిల్ నిర్వాహకులు ప్రభుత్వ అధికారులతో చర్చల అనంతరం సమ్మె విరమించారు. ప్రతి మిల్లులో పత్తి కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని, ఎకరాకు 12 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతించాలనే ప్రధాన డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదిరినట్లు మిల్లర్ల అసోసియేషన్ తెలిపింది. దీంతో జిల్లాలో మంగళవారం సాయంత్రం పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.


