News April 16, 2025
వనపర్తి: భూభారతిపై షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ నెల 17వ తారీకు నుంచి 26 వరకు మండల కేంద్రాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లా యంత్రాంగం షెడ్యూల్ విడుదల చేసింది. రైతులు తమ భూములను రిజిస్ట్రేషన్, ఆర్ఓఆర్ సవరణలు, అడంగల్ తప్పొప్పుల సవరణ, నాలా తదితర వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Similar News
News December 7, 2025
నిజాంసాగర్: ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతి

నిజాంసాగర్ మండలం అచ్చంపేటలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థి ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. బిచ్కుంద మండలం రాజాపూర్కు చెందిన అజయ్ గురుకుల పాఠశాల, కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రాంతంలో ఈతకు వెళ్లగా అక్కడ నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 7, 2025
ఆదిలాబాద్: ‘COC సభ్యత్వానికి డబ్బులు ఇవ్వొద్దు’

ఆదిలాబాద్లోని వ్యాపారులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేషన్ సభ్యత్వం పేరిట డబ్బులు ఇచ్చే అవసరం లేదని, ఇప్పటికే అమాయకుల నుండి డబ్బులు తీసుకున్న ఒక వ్యక్తి పై ఎస్పీకి ఫిర్యాదు చేశామని అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ మాటోలియా తెలిపారు. ఎవరైనా బాధితులు డబ్బులు ఇచ్చినట్లయితే తమకు సమాచారం అందించాలన్నారు. జిల్లా కేంద్రంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న కార్యాలయానికి వచ్చి వివరాలు ఇవ్వాలన్నారు.
News December 7, 2025
10వ తేదీ నుంచి జిల్లా టెట్ పరీక్షలు: డీఈవో

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లును చేసిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. ఈ నెల 10 తేదీ నుంచి 21 వరకు జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలులో 3, ఆదోని,ఎమ్మిగనూరులో 1 చొప్పున పరీక్షా ఏర్పాటు చేశారు. వీటితోపాటు హైదరాబాద్లో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 39,485 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు.


