News April 12, 2025
వనపర్తి: భూసేకరణ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పూర్తి పూర్తిచేసేందుకు మిగిలిన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో భూసేకరణ, భూ నిర్వాసితుల పునరావాస ఏర్పాట్ల పై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బుద్ధారం పెద్ద చెరువు, గణప సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సంబంధించిన భూసేకరణపై చర్చించారు.
Similar News
News October 19, 2025
ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో పొన్నూరు ఎమ్మెల్యే భేటీ

సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నాయుడుపేట పట్టణంలోని ఆమె నివాసంలో గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే, సంగం మిల్క్ డైరీ చైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సంగం డైరీ మేనకూరు సెజ్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు అవుతుండగా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలపై ఇరువురు ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు. సంగం డైరీ రైతులకు, పాల ఉత్పత్తిదారులకు ఆశాకిరణమని ధూళిపాల నరేంద్ర తెలిపారు.
News October 19, 2025
నెల్లూరు జనసేన వివాదంపై త్వరలో విచారణ!

నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఇటీవల ఏర్పడిన వివాదాలపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్‌గా దృష్టి సారించారు. జిల్లా ముఖ్య నేత, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్‌పై కొందరు నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్టీ సీనియర్ నాయకులను కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పార్టీ రాష్ట్ర MSME ఛైర్మన్ శివశంకర్‌ను విచారణకు పంపనున్నారు.
News October 19, 2025
శ్రీకాకుళం: తహశీల్దార్‌ను తొలగించాలని ఆందోళన

ఓ బీసీ మహిళను కొత్తూరు తహశీల్దార్ కె.బాలకృష్ణ మానసికంగా వేధిస్తున్నారని.. ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు కూటికుప్పల నరేశ్ కుమార్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీ సంఘాల నాయకులు శనివారం ఆందోళన చేశారు. ఇంటి స్థలం పొజిషన్ సర్టిఫికెట్ కోసం రూ.30వేలు లంచం ఇవ్వాలని, లేకపోతే తనతో ఒక రోజు గడపాలని తహశీల్దార్ కోరడం దురదృష్టకరమన్నారు.