News March 29, 2025
వనపర్తి: మధుమేహం ఉన్న వారికి వైద్యుల సూచనలు!

✓ అవకాడో, కివి, జామ, బొప్పాయిని తీసుకోవాలి. ✓ ఆహారంలో గ్రీన్ వెజిటేబుల్స్, సలాడ్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ✓ కాకరకాయ, మెంతులు తీసుకుంటే మంచింది. ✓ డ్రై ఫ్రూట్స్లో బాదం, వాల్నట్ తీసుకోవడం మంచిది. ✓ రోజూ కనీసం 45 నిమిషాల పాటు నడవడం ఉత్తమం. ✓ ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి. శారీరక వ్యాయామం చేస్తూ ఉంటే షుగర్ కంట్రోల్లో ఉంటుందని వనపర్తి జిల్లా వైద్య నిపుణుల సూచన.
Similar News
News January 7, 2026
బాపట్ల జిల్లా ఇంజినీరింగ్ విద్యార్థి సూసైడ్

వేటపాలెం (M) జబ్బర్ కాలనీలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా అద్దె రూంలో నివాసం ఉంటున్న ఇంజినీరింగ్ విద్యార్థి ఎం.హర్షిత్ (22) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. తోటి విద్యార్థులు రూముకు వచ్చేసరికి హర్షిత్ ఉరివేసుకొని వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురైనట్లు చెప్పారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 7, 2026
భువనగిరి: బీఆర్ఎస్కు మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి భువనగిరి జిల్లా మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ భీకూ నాయక్ రాజీనామా చేశారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని, గిరిజన బిడ్డనైన తన పట్ల వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అణగారిన వర్గాలకు పార్టీలో గుర్తింపు లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాజీనామా లేఖను జిల్లా పార్టీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డికి పంపారు.
News January 7, 2026
తల్లి వాడే పర్ఫ్యూమ్ వల్ల బిడ్డ విలవిలలాడింది!

వైద్యశాస్త్రానికే సవాలు విసిరిన ఓ వింత కేసు MH పుణేలో జరిగింది. ఓ ఎనిమిదేళ్ల అమ్మాయి 8 నెలల పాటు ఎడతెరిపి లేని దగ్గుతో విలవిలలాడింది. వైద్యులు మందులు మార్చినా తగ్గలేదు. కానీ ఒక నర్సు సూక్ష్మ పరిశీలన అద్భుతాన్ని చేసింది. ఆ తల్లి పర్ఫ్యూమ్ వల్లే బిడ్డ దగ్గుతోందని ఆమె గుర్తించింది. దానిని వాడటం మానేయగానే పాప కోలుకుంది. కొన్నిసార్లు మనం వాడే వస్తువులే పిల్లలను ఇబ్బందిపెడతాయని ఈ ఘటన గుర్తుచేస్తోంది.


