News January 31, 2025
వనపర్తి: మహాత్మా గాంధీని ఎల్లవేళలా స్మరించాలి: జిల్లా ఎస్పీ

నేటి మన స్వాతంత్రం,మన స్వేచ్ఛ మహాత్మా గాంధీ అసమాన త్యాగఫలం అని మనం ఎల్లవేళలా గాంధీని స్మరిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ సూచించారు. గురువారం మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అమర వీరులకు మనం ఎల్లవేళలా స్మరిస్తూ వారి అడుగు జాడల్లో నడవాలని సూచించారు.
Similar News
News February 10, 2025
కాగజ్నగర్: మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి

కాగజ్నగర్ సమీపంలోని పెద్దవాగు వద్ద మినీ మేడారం (సమ్మక్క, సారలమ్మ) జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తుమ్మ రమేష్ తెలిపారు. ఈనెల 12 నుంచి 15 వరకు జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీనివాస్, రాజయ్య, పిరిసింగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
News February 10, 2025
బెల్లంపల్లి: బార్ దాడి ఘటనలో ముగ్గురి రిమాండ్

బెల్లంపల్లి SRR బార్‌లో తాండూర్‌కు చెందిన బండారి వంశీ అనే వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేసిన ముగ్గురు నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు రూరల్ CI అబ్సలుద్దీన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అల్లి సాగర్, రత్నం సోమయ్య, మామిడి అన్నమయ్యలను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు CIవివరించారు.
News February 10, 2025
ఇండియన్ ఐడిల్‌లో ADB జిల్లా యువతి ప్రతిభ

ఇండియన్ ఐడిల్ తో పాటు జీ తెలుగు వారు నిర్వహించిన సరిగమ సూపర్ సింగర్స్ ఫైనల్ పోటీల్లో ఆదిలాబాద్ యువతి మొదటి స్థానంలో నిలిచారు. అదిలాబాద్ భుక్తాపూర్ కాలనీకి చెందిన యువతి అభిజ్ఞ ఆదివారం జరిగిన ఫైనల్లో మొదటి స్థానంలో నిలిచి సత్తాచాటారు. దీంతో కౌన్సిలర్ బండారి సతీష్, కాలనీ వాసులు యువతికి అభినందనలు తెలిపారు.