News February 16, 2025

వనపర్తి: మార్చి 8న జాతీయ లోక్ అదాలత్  

image

వనపర్తి జిల్లాలోని కోర్టులలో మార్చి 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత పేర్కొన్నారు. రాజీ పడదగిన అన్ని క్రిమినల్, సివిల్, బ్యాంకు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కారం చేసుకునేలా కృషి చేయాలన్నారు.

Similar News

News February 25, 2026

జగిత్యాల: కలెక్టరేట్‌లో మీ సేవ ఆపరేటర్ల వన్‌డే ట్రైనింగ్

image

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీ సేవ ఆపరేటర్లకు సదరం/యూడీఐడీ వెబ్‌సైట్ ద్వారా వికలాంగత్వ ధృవీకరణ ప్రక్రియపై ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొత్తగా చేర్చిన 21 కేటగిరీల స్లాట్ బుకింగ్ విధానం, తాత్కాలిక సర్టిఫికేట్ రీ–అసెస్‌మెంట్ స్లాట్ బుకింగ్, UDID సదరం శిబిరాల వివరాలు, పేరు, జనన తేది, ఆధార్ అప్‌డేషన్, E-KYC(ఎస్‌ఓపీ) ప్రక్రియ,ఆన్లైన్ గ్రీవెన్స్ నమోదు విధానాల గురించి తెలిపారు.

News February 25, 2026

ప్రియురాలితో బిగ్‌బాస్ నటుడి ఎంగేజ్‌మెంట్

image

యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రేయసి వైష్ణవిని పరిచయం చేసిన అతడు ఇవాళ ఆమెకు రింగ్ తొడిగారు. ఈ ఫొటోలను SMలో షేర్ చేశారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఈ జంటకు విషెస్ చెబుతున్నారు. కాగా బిగ్‌బాస్-5లో షణ్ముఖ్ రన్నరప్‌గా నిలిచారు.

News February 25, 2026

సిద్దిపేట: న్యూసెన్స్ చేసిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష

image

బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి సిద్దిపేట కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామానికి చెందిన శంకర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించాడు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ, అసభ్య పదజాలంతో దూషించడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది.