News January 27, 2025
వనపర్తి: మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా అదనపు కలెక్టర్

వనపర్తి జిల్లాలోని 5 పురపాలికలకు ప్రత్యేక అధికారిగా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ బాధ్యతలు స్వీకరించారు. జనవరి 26తో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల చైర్మన్లు,కౌన్సిలర్ల పదవీకాలం పూర్తి కావడంతో సోమవారం నుంచి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. వనపర్తి మున్సిపాలిటీలో అదనపు కలెక్టర్ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టారు.
Similar News
News November 24, 2025
భద్రాద్రి BRSలో ముసలం.. రేగా వర్సెస్ సీనియర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుకు, సీనియర్లకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. అశ్వారావుపేట, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేల మధ్య భేదాభిప్రాయాలు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయట. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలో నెలకొన్న కుమ్ములాటల కారణంగా ఇబ్బందులు తప్పవని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
News November 24, 2025
మెదక్ జిల్లా జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అసీమ్ బిన్ అబ్దుల్లా

మెదక్ జిల్లా జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిన్న శంకరంపేట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అసీమ్ బిన్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. మొత్తం 54 ఓట్లు పోలవ్వగా ఆసీమ్ బిన్ అబ్దుల్లాకు 41 ఓట్లు, గీత అగర్వాల్ 13 ఓట్లు వచ్చాయి.
ఈ ఎన్నికలను స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించగా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేసన్న ఎన్నికల అధికారిగా వ్యవహారించారు.
News November 24, 2025
అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇంటికి CP సజ్జనార్

హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహనంలో స్వయంగా గస్తీ నిర్వహించారు. లంగర్హౌజ్ పీఎస్ పరిధిలోని ఎండీ లైన్స్, ఆశాంనగర్, డిఫెన్స్కాలనీల్లోని రౌడీషీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు. ఇంట్లోనే ఉన్న రౌడీషీటర్లను నిద్రలేపి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, వ్యవహార ధోరణులపై ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని CP సజ్జనార్ హెచ్చరించారు.


