News March 27, 2025

వనపర్తి: మృతిపై అనుమానం.. అంత్యక్రియలు నిలిపివేత..!

image

ఓ వ్యక్తి మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు..వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం వాసి కృష్ణయ్య(42) మృతిచెందాడు. బుధవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా అతడి మోకాళ్ల వద్ద గాయాలు,శరీరం మొత్తం ఉబ్బి ఉండడం గమనించిన బంధువులు దహన సంస్కారాలను నిలిపివేశారు. ఈవిషయమై మృతుడి చిన్నాన్న వెంకన్న PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి బాడీని జిల్లా మార్చురీకి తరలించామని SIసురేశ్ తెలిపారు.

Similar News

News December 2, 2025

హైదరాబాద్‌లో జిల్లా జర్నలిస్టుల ధర్నా

image

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తలపెట్టిన చలో సమాచార భవన్ కార్యక్రమం విజయవంతమైనట్లు టీడబ్ల్యూజే ఎఫ్ జిల్లా కార్యదర్శి కుడి తాడి బాపురావు తెలిపారు. ఈ ధర్నాలో జర్నలిస్టులకు కొత్త అక్రిడియేషన్ కార్డులు, భీమా, ఆరోగ్య ప్రయోజనాలు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని తదితర సమస్యలను డిమాండ్ చేసినట్లు కరీంనగర్ జిల్లా జర్నలిస్టులు పేర్కొన్నారు.

News December 2, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జనగామలో అరుదైన కపాల శాస్త్ర చికిత్స
> శ్రీపతిపల్లి సర్పంచ్ బరిలో సొంత అన్నదమ్ములు
> నర్మెట్ట: వైద్య వృత్తిని వదిలి ప్రజాసేవలోకి.. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్
> తీగల తండా సర్పంచ్ గా సాంబరాజు యాదవ్ ఏకగ్రీవం
> నామినేషన్ ప్రక్రియ సజావుగా జరగాలి ఎన్నికల అబ్జర్వర్
> ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలి: అదనపు కలెక్టర్
> ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జనగామ జిల్లా కలెక్టర్

News December 2, 2025

పాలమూరు: ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలి

image

సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఓటర్లు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తమ పోలీస్ అధికారులకు సహకరించాలని ఎస్పీ జానకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి సమస్యలు వచ్చిన తమ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.