News January 24, 2025
వనపర్తి: రాజకీయాలకు చివరి తేదీ లేదు: ఎమ్మెల్యే

రాజకీయాల్లో కొనసాగాలనుకునే వారికి చివరి తేదీ అంటూ ఏమీ లేదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా అందరం కలిసికట్టుగా వనపర్తి అభివృద్ధికి పనిచేద్దామన్నారు. అన్ని వార్డులు మనవేనని అభివృద్ధిలో వివక్ష చూపేది లేదన్నారు. కౌన్సిలర్ల పదవీకాలం ముగివస్తున్న నేపథ్యంలో అందరికీ శాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
Similar News
News February 13, 2025
రాష్ట్రపతి పాలనలో మణిపుర్ రికార్డు

అత్యధికసార్లు(11) రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంగా మణిపుర్ రికార్డుల్లోకి ఎక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో UP(10), J&K(9) బిహార్(8), పంజాబ్(8) ఉన్నాయి. రోజుల(4,668) పరంగా J&K టాప్‌లో ఉంది. ఆ తర్వాత పంజాబ్(3,878), పాండిచ్చేరి(2,739) ఉన్నాయి. 1951లో తొలిసారిగా పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పటికి 29 రాష్ట్రాలు/UTలలో 134సార్లు విధించారు. TG, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కసారీ ప్రెసిడెంట్ రూల్ రాలేదు.
News February 13, 2025
2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలి: చంద్రబాబు

AP: 2027 జూన్ నాటికి పోలవరం పూర్తయ్యే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేర పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి, నీళ్లు విశాఖకు తీసుకెళ్లే సమయానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టూ అందుబాటులోకి తేవాలన్నారు. అటు వెలిగొండ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాలని సూచించారు.
News February 13, 2025
నెల్లూరు: ప్రణతికి డాక్టరేట్ ప్రదానం

రాజకీయలలో మహిళల పాత్ర అనే అంశంపై నెల్లూరు జిల్లాకు చెందిన ఓ.ప్రణతి కి గురువారం డాక్టరేట్ ప్రదానం చేశారు. హైదరాబాదులోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (CESS)లో ప్రొఫెసర్ బలరాములు పర్యవేక్షణలో పట్టణ మరియు స్థానిక రాజకీయలలో మహిళల పాత్ర అనే అంశంపై ప్రణతి చేసిన పరిశోధనకు డాక్టరేట్ అందించారు. ఈ సందర్భంగా సెస్ డీన్, ఆచార్యులు, ఇతర అధ్యాపక బృందం పరిశోధకురాలికి అభినందనలు తెలిపారు.