News March 29, 2025
వనపర్తి: రాజీవ్ యువ వికాసానికి అర్హతలు ఇవే.!

✓ గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల వార్షికాదాయం, పట్టణ ప్రాంతాల్లో రూ.2 వార్షికాదాయం ఉన్నవారు అర్హులు.✓ దరఖాస్తులో రేషన్ కార్డు వివరాలు సమర్పించాలి. రేషన్ కార్డు లేకుంటే తాజా ఆదాయ ధ్రువపత్రం వివరాలను ఇవ్వాలి. ✓ వ్యవసాయేతర కేటగిరీలకు దరఖాస్తుదారు వయసు 21-55 సంవత్సరాల మధ్య ఉండాలి. ✓ వ్యవసాయ అనుబంధ కేటగిరీ యూనిట్లకు 21-60 ఏళ్ల మధ్య ఉండాలి.✓ ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తికి మాత్రమే అర్హత.
Similar News
News January 11, 2026
సంగారెడ్డి: 11 మున్సిపాలిటీలకు సమన్వయకర్తల నియామకం

జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ సమన్వయకర్తలను ప్రకటించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ తెలిపారు. సంగారెడ్డి-రాజనర్సు, సదాశివపేట-సపాన్ దేవ్, జహీరాబాద్-దేవి ప్రసాద్, కోహిర్-ఎంఏ హకీం, జోగిపేట- నరహరి రెడ్డి, ఖేడ్- జైపాల్ రెడ్డి, జిన్నారం-సాయిరాం, గడ్డపోతారం- సోమిరెడ్డి, ఇస్నాపూర్- శ్రీనివాస్, ఇంద్రేశం- అభిలాష్ రావులను నియమించినట్లు చెప్పారు.
News January 11, 2026
NRPT: ‘డయల్ యువర్ ఎస్పీని సద్వినియోగం చేసుకోండి’

సోమవారం నిర్వహించే ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డాక్టర్ వినీత్ కోరారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు బాధితులు 08506-281182 నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను నేరుగా వివరించవచ్చని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
News January 11, 2026
విశాఖ పోలీసులను అభినందించిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా

విశాఖలో మహిళపై దాడి కేసులో స్పష్టమైన ఆధారాలు లేకున్నా పోలీసులు కేసు ఛేదించారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసులు స్పందించిన తీరు, వేగవంతమైన దర్యాప్తు అభినందనీయమని ఆయన కొనియాడారు. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయనేందుకు ఇదే నిదర్శనమన్నారు. మహిళల రక్షణలో దేశంలోనే విశాఖకు మొదటి స్థానం కూటమి ఘనతే అన్నారు.


