News March 20, 2025

వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రగతిశీల బడ్జెట్: చిన్నారెడ్డి

image

అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టింది ప్రగతిశీల బడ్జెట్ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. సేవారంగానికి అధిక నిధులు కేటాయించింది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనన్నారు. అభివృద్ధి సంక్షేమ సేవా రంగాలకు తగు పాళ్లలో కేటాయింపులు చేశారని రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి బడ్జెట్ తోడ్పడుతుందని అన్నారు. 

Similar News

News October 16, 2025

RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL)లో 17 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిప్లొమా, బీఈ/బీటెక్‌లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rvnl.org/

News October 16, 2025

స్థానిక ఎన్నికలు.. ఇవాళ ఏం జరగనుంది?

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. SC ఇవాళే తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందా? లేక విచారణను వాయిదా వేస్తుందా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు స్టేతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి అనుకూలంగా SC నిర్ణయం ప్రకటిస్తే ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది.

News October 16, 2025

గద్వాల: మద్యం దుకాణాలకు 127 దరఖాస్తులు

image

గద్వాల జిల్లాలోని ప్రభుత్వం నియమించిన 34 మద్యం దుకాణాలకు బుధవారం వరకు వచ్చిన దరఖాస్తులు గద్వాల్ 71, అలంపూర్ 56 జిల్లా వ్యాప్తంగా మొత్తం 127 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇంకా మూడు రోజుల సమయం ఉన్నందున దరఖాస్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అన్నారు.