News April 8, 2025

వనపర్తి: రేపటి నుంచే వార్షిక పరీక్షలు 

image

వనపర్తి జిల్లా పాఠశాలల్లో 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 17న పరీక్షలు ముగియనున్నాయి. అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఈనెల 23న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించాలని ఆదేశించింది.

Similar News

News November 17, 2025

టెరిటోరియల్ ఆర్మీలోకి మహిళలు!

image

టెరిటోరియల్ ఆర్మీలోకి మహిళలను చేర్చుకునే అంశాన్ని ఆర్మీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని బెటాలియన్లలో నియామకాలు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక ఫలితాలను విశ్లేషించిన తర్వాత ఇతర బెటాలియన్లలోనూ నియమించుకునే అవకాశం ఉంది. ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో నారీ శక్తి పెరగాలన్న ప్రభుత్వ ప్రయత్నాల నేపథ్యంలో ఈ దిశగా అడుగులు పడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

News November 17, 2025

నేడు నక్తం పాటిస్తున్నారా?

image

ఈ పవిత్ర కార్తీక మాసంలో చివరి సోమవారానికి చాలా విశిష్టత ఉంది. గత సోమావారాల్లో ఆచరించని విధులను నేడు ఆచరిస్తే అంతకన్నా ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్మకం. శివ భక్తులు ముఖ్యంగా నేడు ‘నక్తం’ దీక్షను పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా సకల శుభాలు కలుగుతాయని అంటున్నారు. నక్తం అంటే.. పగలు ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేయడం. ఈ దీక్షతో శివానుగ్రహంతో అఖండ పుణ్యం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం.

News November 17, 2025

నేడు నితీశ్ రాజీనామా.. 20న ప్రమాణం?

image

బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా CM నితీశ్ కుమార్ ఇవాళ రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈనెల 20న ఆయన తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మొత్తం 32 మందితో కొత్త క్యాబినెట్‌ కొలువుదీరనుందని, బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని సమాచారం. స్పీకర్‌గా బీజేపీ సభ్యుడినే నియమిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉందని చెప్పాయి.