News March 29, 2025

వనపర్తి: రేషన్‌కార్డు దారులకు శుభవార్త

image

ఉగాది పర్వదినం నుంచి ప్రజలకు సన్నబియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రేషన్‌కార్డుల్లో పేర్లు నమోదై ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా చేయనున్నారు. మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీతో రేషన్‌కార్డులు కలిగి ఉన్నవారందరికీ ప్రయోజనం కలుగనున్నది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 21, 2025

KCR చావును నేనెందుకు కోరుకుంటా: రేవంత్

image

TG: తాను <<18631886>>చనిపోవాలని<<>> శాపాలు పెట్టడమే ఈ ప్రభుత్వ విధానం అన్న KCR వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. ‘KCR చావాలని నేనెందుకు కోరుకుంటా. కుర్చీ కోసం అల్లుడు, కొడుకు కేసీఆర్ చావు కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. KCR తమలపాకుతో కొడితే నేను తలుపు చెక్కతో కొట్టే రకం. ఆయనకు బయటవాళ్లతో ఎలాంటి ప్రమాదం లేదు. కుటుంబసభ్యులతోనే ప్రమాదం. KTR, హరీశ్ KCRను నిర్బంధించారు’ అని వ్యాఖ్యానించారు.

News December 21, 2025

60 మంది బాలబాలికలకు క్రికెట్ మ్యాచ్ పాస్‌లు ఏర్పాటు చేసి సీపీ

image

విశాఖలో ఆదివారం జరుగుతున్న ఇండియా- శ్రీలంక క్రికెట్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు 60 మంది స్వచ్చంధ సంస్థల బాలబాలికలకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చి అవకాశం కల్పించారు. స్వచ్చంధ సంస్థలలో ఉంటున్న 60 మంది బాలబాలికలకు క్రికెట్ మ్యాచ్ పాస్‌లు ఏర్పాటు చేశారు. సీపీ బాలబాలికలను స్టేడియంలో కలిసి ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.

News December 21, 2025

బిగ్‌బాస్ ఫినాలే.. ఇద్దరే మిగిలారు

image

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 గ్రాండ్ ఫినాలే కొనసాగుతోంది. టాప్-3 నుంచి డెమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యారు. హీరో రవితేజ ఆఫర్ చేసిన రూ.15 లక్షలు తీసుకొని హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పటికే సంజన, ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో టాప్-2లో కళ్యాణ్, తనూజ నిలిచారు. కాసేపట్లో విన్నర్ ఎవరో తేలనుంది.