News March 19, 2025
వనపర్తి: రైతులకు ఏం చేశారో చెప్పండి: మాజీ మంత్రి

అజ్ఞానం, అనుభవరాహిత్యం, అహంకారంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రెండేళ్ల పాలన పూర్తికాక ముందే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. 2050 నాటికి తెలంగాణ రైజింగ్ ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెసోళ్లు రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. పదేళ్ల KCRపాలనలో తెలంగాణ నంబర్ 1గా ఉందన్నారు.
Similar News
News November 20, 2025
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై వరంగల్ పోలీసుల కఠిన చర్యలు!

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు వరంగల్ పోలీసు శాఖ విస్తృత స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ చర్యల్లో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్లపై ప్రత్యేక దాడులు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదాలను అరికట్టేందుకు రాత్రి వేళల్లో కూడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను తనిఖీ చేస్తున్నామన్నారు.
News November 20, 2025
HYD: రాహుల్ ద్రవిడ్‌తో ఫ్రీడం ఆయిల్ ‘కోచింగ్ ది కోచ్’

ప్రముఖ వంట నూనె బ్రాండ్లలో ఒకటైన ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో రాహుల్ ద్రవిడ్ ప్రముఖంగా కనిపిస్తారని ఆ సంస్థ తెలిపింది. DRS (డిసీషన్ రివ్యూ సిస్టమ్) VS PRS (ప్యాక్ రివ్యూ సిస్టమ్)తో ప్రచారం చేయనుంది. ఈ భావనను ఉపయోగించి తమ కొత్త ‘కోచింగ్ ది కోచ్’ ప్రచారాన్ని ప్రారంభించింది. వినియోగదారులకు లీటర్ ఆయిల్ ప్యాకెట్ 910గ్రా. బరువుండాలని అవగాహన కల్పించనుంది.
News November 20, 2025
గింజ కోసం మొక్కజొన్న సాగు.. కోత సమయం ఇలా గుర్తించాలి

గింజ కోసం సాగు చేసే మొక్కజొన్న కోత సమయాన్ని కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు. కండెల పైపొరలు ఎండినట్లు పసుపు వర్ణంలో కనిపిస్తాయి. బాగా ఎండిన కండెలు మొక్కల నుంచి కిందకు వేలాడుతూ కనిపిస్తాయి. కండెలలోని గింజలను వేలిగోరుతో నొక్కినప్పుడు గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడవు. కండెలోని గింజలను వేరుచేసి వాటి అడుగు భాగం పరీక్షిస్తే (కొన్ని రకాలలో) నల్లని చారలు కనిపిస్తాయి. ఈ సమయంలో పంట కోస్తే మంచి దిగుబడి వస్తుంది.


