News March 19, 2025
వనపర్తి: రైతులకు ఏం చేశారో చెప్పండి: మాజీ మంత్రి

అజ్ఞానం, అనుభవరాహిత్యం, అహంకారంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రెండేళ్ల పాలన పూర్తికాక ముందే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. 2050 నాటికి తెలంగాణ రైజింగ్ ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెసోళ్లు రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. పదేళ్ల KCRపాలనలో తెలంగాణ నంబర్ 1గా ఉందన్నారు.
Similar News
News April 19, 2025
ఘోరం: విద్యుత్ షాకిచ్చి.. గోళ్లు పీకి..

ఛత్తీస్‌గఢ్ కోర్బా జిల్లాలోని ఓ ఐస్‌క్రీమ్ పరిశ్రమ యజమానులు ఇద్దరు కార్మికుల పట్ల అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారు. దొంగతనం చేశారన్న అనుమానంతో వారిద్దరి దుస్తులు ఊడదీసి కరెంట్ షాకిచ్చారు. అనంతరం గోళ్లు పెకలించి హింసించారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
News April 19, 2025
పార్వతీపురం: రేపు పాఠశాలలకు సెలవు

పార్వతీపురం మన్యం జిల్లాలో 220 రోజులు పని దినాలు పూర్తి కాకపోవడంతో రేపు పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని డీఈవో రమాజ్యోతి గతంలో చెప్పారు. ఈస్టర్ పండగ కారణంగా ఉపాధ్యాయుల కోరిక మేరకు సెలవు ప్రకటించినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా గమనించాలని ఆమె ఈ ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కన్నారు.
News April 19, 2025
జేఈఈ మెయిన్-2025 ఫలితాల్లో SR ప్రభంజనం

SR విద్యాసంస్థల విద్యార్థులు జేఈఈ మెయిన్-2025 ఫలితాల్లో జాతీయస్థాయిలో సత్తా చాటారని సంస్థ యాజమాన్యం తెలిపింది. జాతీయ స్థాయిలో నాగసిద్దార్థ-5, పాటిల్ సాక్షి-48, అరుణ్-60, రవిచరణ్ రెడ్డి-65, భరణి శంకర్-88, సురేష్-98 ర్యాంకులతో సత్తా చాటారని తెలిపారు. 3,556 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్‌కు అర్హత సాధించారని, వారందరినీ ఛైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి అభినందించారు.