News September 17, 2024
వనపర్తి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరారు.. గ్రామానికి సమీపంలోని పోగాకు కంపెనీ వద్ద జాతీయ రహదారిపై హైదారాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న ఆర్టీసీ సూపర్ డీలక్స్ బస్సు, టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఎక్స్ ఎల్ పై ఉన్న పెండ్లి రాముడు అక్కడిక్కడే మృతి చెందగా శేఖర్ ఆసుపత్రికు తరలిస్తున్న మార్గమధ్యలో మృతి చెందాడు
Similar News
News October 23, 2025
MBNR: నేర సమీక్ష.. కేసుల దర్యాప్తుపై ఎస్పీ దృష్టి

మహబూబ్నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో క్రైమ్ కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితిపై ఆరా తీశారు. మహిళలు, బాలలపై నేరాలు, సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 23, 2025
MBNR: పోలీస్ ప్రధాన కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి నెల వారి నేర సమీక్షను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్రైమ్కు సంబంధించిన అన్ని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. దర్యాప్తు నాణ్యతను మెరుగుపరిచి న్యాయస్థానాల్లో దోషులకు శిక్షపడేలా బలమైన సాక్ష్యాలు సేకరించాలన్నారు.
News October 23, 2025
మహమ్మదాబాద్లో అత్యధిక వర్షపాతం

మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మహమ్మదాబాద్ మండలంలో 13.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. హన్వాడ 13.7, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 4.8, గండీడ్ మండలం సర్కార్ పేట, దేవరకద్ర 3.8 , మహబూబ్నగర్ గ్రామీణం, భూత్పూర్ 3.3, జడ్చర్ల 3.0, నవాబుపేట మండలం కొల్లూరు 2.5, బాలానగర్ 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది.