News February 10, 2025

వనపర్తి: రోడ్డు ప్రమాదంలో ఫొటోగ్రాఫర్ మృతి

image

బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఓ ఫొటోగ్రాఫర్ మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. చందాపూర్‌కి చెందిన అనిల్‌కుమార్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నారు. నిన్న రాత్రి వనపర్తి నుంచి చందాపూర్ వస్తుండగా మార్గమధ్యలో బైక్‌పై వెళ్తుండగా.. అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News February 9, 2026

శ్రీశైలం బ్రహ్మోత్సవాలు.. 40లక్షల లడ్డూలు

image

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు బృంగి వాహనంపై మల్లన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 3వేల మంది పోలీసులతో భద్రత కల్పించి, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. భక్తుల కోసం 40 లక్షల లడ్డూలను అధికారులు అందుబాటులో ఉంచారు.

News February 9, 2026

SKLM: వరుస దొంగతనాలు.. ప్రజల హడల్

image

మందసలోని బాలిగాం గ్రామంలో వరుస దొంగతనాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. కిల్లి శారదమ్మ ఇంట్లో తులమున్నర బంగారం, వల్లభ భూదేవి ఇంట్లో ఆరు తులాల వెండి పట్టుకొని పోయారు. దాంతో పాటు మార్పు భుజంగరావు ఇంట్లో బీరువాలను తెరిచి చిందర వందరగా పడేశారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డ గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, మందస ఎస్ఐ కృష్ణప్రసాద్ వివరాలు సేకరించారు.

News February 9, 2026

హుస్నాబాద్ : పొలంలో కుప్పకూలి యువ రైతు మృతి

image

హుస్నాబాద్ మండల పరిధిలోని అరపల్లెలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్ల అజయ్ యాదవ్ అనే యువ రైతు ఆదివారం పొలం వద్ద ప్రమాదవశాత్తు మరణించారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో ఆయన పొలంలోనే పడిపోయి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి.