News March 18, 2025

వనపర్తి: విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం 

image

వనపర్తి జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సకాలంలో ఏకరూప దుస్తులు అందించే విధంగా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఉచిత ఏకరూప దుస్తుల విషయంలో మంగళవారం కలెక్టరేట్‌లో విద్యా శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చారు.

Similar News

News September 16, 2025

పంటకు అధిక యూరియాతో కలిగే నష్టాలు

image

చాలా మంది రైతులు ఎక్కువ దిగుబడి వస్తుందని పంటకు అధికంగా యూరియా వేస్తున్నారు. సిఫార్సుకు మించి వేసిన యూరియా ఒకేసారి నీటిలో కరిగిపోతుంది. 2-3 రోజుల్లో పంట కొంత వరకు మాత్రమే తీసుకోగలుగుతుంది. మిగిలింది వృథాగా భూమి లోపలి పొరల్లోకి, ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోతుంది. దీని వల్ల ఎరువు నష్టంతో పాటు పంటను ఎక్కువగా పురుగులు, తెగుళ్లు ఆశించి బలహీన పరుస్తాయి. కాబట్టి నిపుణుల సిఫార్సు మేరకే యూరియా వేసుకోవాలి.

News September 16, 2025

ప్రీఎక్లంప్సియాను ముందుగానే గుర్తించొచ్చు!

image

కొందరు మహిళలకు ప్రెగ్నెన్సీలో మూత్రం నుంచి ప్రొటీన్ వెళ్లిపోతుంది. దీన్నే ప్రీఎక్లంప్సియా అంటారు. సరైన సమయంలో గుర్తించి, చికిత్స చేయకపోతే తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదం వస్తుంది. దీనికోసం IITమద్రాస్ పరిశోధకులు ఒక టెస్ట్‌కిట్‌ అభివృద్ధి చేశారు. ఒక్కచుక్క రక్తంతో టెస్ట్ చేస్తే అరగంటలోనే ఫలితం వస్తుంది. P-FAB టెక్నాలజీతో ఇది పనిచేస్తుందని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ VV రాఘవేంద్రసాయి వెల్లడించారు.

News September 16, 2025

PDPL: నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5లక్షల- రూ.10 లక్షల వరకు జరిమానా

image

వైన్ షాపులు, బార్ల ఎదుట రోడ్లపై మద్యం సేవించడం శ్రేయస్కరం కాదని, ఇది సామాజిక అశాంతికి దారి తీస్తోందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్పష్టం చేశారు. ప్రజల అసౌకర్యం, పారిశుద్ధ్య లోపం దృష్ట్యా ఇలాంటి చర్యలు నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానాలు తప్పవని హెచ్చరించారు. సమీక్షలో అబ్కారీశాఖ అధికారి మహిపాల్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.