News March 8, 2025
వనపర్తి: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రాథమిక విచారణ జరిపి ఆరోపణలు వాస్తవమని తేలడంతో శుక్రవారం బీసీ సంక్షేమ అధికారి బీరం సుబ్బారెడ్డిని సస్పెండ్ చేశామన్నారు. సుబ్బారెడ్డి నిర్వహిస్తున్న బీసీ, గిరిజన సంక్షేమ శాఖల బాధ్యతలను డీఆర్డీఓ ఉమాదేవికి అప్పగించారు.
Similar News
News October 22, 2025
వరంగల్ మార్కెట్ లో మిర్చి ధరలు ఇలా..!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.16,000 ధర పలకింది. వండర్ హాట్(WH) మిర్చి రూ.16, 500, తేజా మిర్చి ధర రూ.14,400గా ఉంది. జాతీయ మార్కెట్లో మిర్చికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.
News October 22, 2025
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల జాబితా.!

అమరావతి-అమరేశ్వరస్వామి దేవాలయం.
కోటప్పకొండ-శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయం.
పెదకాకాని-శ్రీ మల్లేశ్వరస్వామి.
బాపట్ల-సోమనాథేశ్వరస్వామి ఆలయం.
చీరాల-శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయం.
మాచర్ల-కాళహస్తేశ్వరస్వామి.
గురజాల-వీరేశ్వరస్వామి.
సత్తెనపల్లి-పాండురంగేశ్వరస్వామి.
చేబ్రోలు-చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వరస్వామి.
గోవాడ-శ్రీ బాల కోటేశ్వరస్వామి.
చిలుమూరు-శ్రీ రామ లింగేశ్వరస్వామి ఆలయం.
గుంటూరు-సాంబశివాలయం.
News October 22, 2025
కేటీఆర్, హరీశ్‌రావుతో కేసీఆర్ సమీక్ష

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సమీక్షిస్తున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా వ్యూహం, ప్రచార సరళి గురించి ఆయనకు కేటీఆర్, హరీశ్‌రావు వివరిస్తున్నారు. రేపు జరగనున్న బీఆర్ఎస్ ఇన్ఛార్జుల సమావేశంపైనా చర్చిస్తున్నట్లు సమాచారం.