News March 8, 2025

వనపర్తి: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రాథమిక విచారణ జరిపి ఆరోపణలు వాస్తవమని తేలడంతో శుక్రవారం బీసీ సంక్షేమ అధికారి బీరం సుబ్బారెడ్డిని సస్పెండ్ చేశామన్నారు. సుబ్బారెడ్డి నిర్వహిస్తున్న బీసీ, గిరిజన సంక్షేమ శాఖల బాధ్యతలను డీఆర్డీఓ ఉమాదేవికి అప్పగించారు.

Similar News

News March 21, 2025

అమెరికా విద్యాశాఖ మూసేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం

image

అమెరికాలో విద్యాశాఖను మూసేస్తూ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకోగా తాజాగా విద్యాశాఖపై బాంబ్ పేల్చారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆ శాఖలోని ఉద్యోగాల్లో కోతలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా విద్యాశాఖను మూసేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు.

News March 21, 2025

రైలు నుంచి జారిపడి బిక్కవోలు వాసి మృతి

image

భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గురువారం జారిపడి మృతి చెందాడని రైల్వే ఎస్ఐ సైమన్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా బిక్కవోలుకు చెందిన అంబటి సుబ్బా రెడ్డి (69) సింహాద్రి రైల్లో రాజమండ్రి వైపు వెళుతున్న సమయంలో జారిపడి మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

News March 21, 2025

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

image

AP: తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవా టికెట్ల జూన్ నెల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు TTD ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే, జూన్ 9- 11 వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలకు సంబంధించి టికెట్లు ఉ.11 గంటలకు రిలీజ్ అవుతాయి. వీటితో పాటు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటా టోకెన్లు మ.3 గంటలకు విడుదల కానున్నాయి.

error: Content is protected !!