News February 21, 2025
వనపర్తి: వివాహిత ఆత్మహత్య

రేవల్లి మండలంలో ఓ వివాహిత కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. కొంకలపల్లికి చెందిన శివలీల (38)కు బంగారయ్యతో వివాహమయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు. కాగా.. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన శివలీల వ్యవసాయపొలంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 4, 2025
హోంగార్డు కుటుంబానికి అండగా ఉంటాం: SP

హోంగార్డు సిహెచ్. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని ఎస్పీ కె.నారాయణ రెడ్డి తెలిపారు. నేడు వికారాబాద్ పోలీస్ కార్యలయంలోని MT సెక్షన్లో విధులు నిర్వహిస్తూ, అకాల మరణం చెందిన హోం గార్డ్ సిహెచ్.శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఎస్పీ పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. శ్రీనివాస్ హఠాన్మరణం తీవ్రంగా కలచి వేసిందని పేర్కొన్నారు.
News November 4, 2025
సోమల: ముళ్ల పొదలలో నవజాత శిశువు

అప్పుడే పుట్టిన నవజాత శిశువును ముళ్ల పోదలలో గుర్తు తెలియని వ్యక్తులు పడవేసిన ఘటన సోమల మండలంలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ నడింపల్లి సమీపంలో శిశువును గుర్తించిన స్థానికులు సోమల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స ఇచ్చిన తరువాత ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు చిన్నారిని అంబులెన్స్‌లో చిత్తూరు శిశు విహార్‌కు తరలించారు.
News November 4, 2025
AP న్యూస్ అప్డేట్స్

✦ రైతులకు YCP ఏం చేసిందో అసెంబ్లీలో చర్చిద్దామా? జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్
✦ నకిలీ మద్యం కేసులో ఏడుగురిని కస్టడీకి ఇచ్చిన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు.. ఈ నెల 7 నుంచి 11 వరకు నిందితులను ప్రశ్నించనున్న పోలీసులు
✦ మద్యం కేసు నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 7కు వాయిదా వేసిన విజయవాడ ACB కోర్టు.. కౌంటర్ వేయాలని సిట్‌కు ఆదేశం


