News February 21, 2025
వనపర్తి: వివాహిత ఆత్మహత్య

రేవల్లి మండలంలో ఓ వివాహిత కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. కొంకలపల్లికి చెందిన శివలీల (38)కు బంగారయ్యతో వివాహమయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు. కాగా.. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన శివలీల వ్యవసాయపొలంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News March 16, 2025
అమరావతి కోసం రూ.11వేల కోట్లు.. నేడు ఒప్పందం

AP: నేడు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో), సీఆర్డీఏ మధ్య ఒప్పందం కుదరనుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 22న హడ్కో రూ.11వేల కోట్ల రుణం మంజూరు చేసింది. నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదరనుంది. అగ్రిమెంట్ అయ్యాక హడ్కో నిధులను విడుదల చేయనుంది.
News March 16, 2025
ములుగు జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

ములుగు జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం ఇంకా వీడలేదు. కొంతమంది చేపలు, మటన్ వైపు మొగ్గు చూపుతుంటే, చికెన్ కొనుగోలు చేసి తింటున్నారు. జిల్లాలో చికెన్ ధరల్లో ప్రాంతాన్ని బట్టి మార్పులు ఇలా ఉన్నాయి. కేజీ చికెన్ రూ.220 ఉండగా.. స్కిన్లెస్ రూ. 240గా ఉంది. హోల్సేల్ రూ.80-90 ఉండగా, రిటైల్ 130 వరకు ధర పలుకుతుంది. ఈ చికెన్ ధరల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మార్పులు సైతం ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.
News March 16, 2025
భువనగిరి: గ్రేట్.. మూడు జాబ్స్ కొట్టాడు

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం రావడమే గగనం. అలాంటిది ఏకంగా 3 ఉద్యోగాలను కొల్లగొట్టి ఔరా అనిపించాడు భువనగిరి మండలం గౌస్ నగర్ గ్రామానికి చెందిన అజయ్ కుమార్ రెడ్డి. గ్రూప్-2లో 713, గ్రూప్-3లో 451వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్-4లో 336వ ర్యాంక్ సాధించి ఇప్పటికే కలెక్టర్ ఆఫీస్‌లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. దీంతో అజయ్‌కు తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.