News April 5, 2025
వనపర్తి: విషాదం.. శివ మృతి

వనపర్తి మండలం చిన్నగుంటపల్లి గ్రామానికి చెందిన శివ శ్రీరామనవమి ఏర్పాట్లలో భాగంగా కరెంట్ షాక్ గురై మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి శివ మృతదేహానికి నివాళులర్పించారు. శివ కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ధైర్యంగా ఉండమని మనోధైర్యం చెప్పారు.
Similar News
News January 5, 2026
NLG: బ్యాలెట్ వైపే మొగ్గు!

మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అందుకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచనప్రాయంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే 2014లో ఈవీఎంలతో, 2020లో కరోనా కారణంగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ప్రభుత్వం బ్యాలెట్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
News January 5, 2026
హ్యాపీ హార్మోన్స్ కోసం ఇలా చేయాలి

ఎమోషన్స్ బావుండటానికి, రోజంతా హ్యాపీగా ఉండటానికి శరీరంలో సెరటోనిన్ హార్మోన్ సరిపడినంత ఉండటం ముఖ్యం. దీన్ని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. పీచు పదార్థాలు, ప్రోబయోటిక్స్ ఎక్కువగా తీసుకోవడం, రోజూ ఎండలో కాసేపు ఉండటం, ధ్యానం చేయడం వల్ల సెరటోనిన్ పెరుగుతుంది.. ట్రిప్టోపాన్ అనే అమైనో యాసిడ్ మెదడులో సెరటోనిన్‌గా కన్వర్ట్ అవుతుంది. ఇది గుడ్లు, నట్స్, సీడ్స్, సాల్మన్ ఫిష్‌లో ఎక్కువగా ఉంటుంది.
News January 5, 2026
ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా.. జేఎన్‌యూ స్టడీ

ఢిల్లీ గాలిలో ప్రమాదకర స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియాను గుర్తించారు. యాంటీబయాటిక్స్‌కు కూడా లొంగని ఈ సూపర్‌బగ్ ఉన్నట్టు జేఎన్‌యూ స్టడీలో వెల్లడైంది. దేశ రాజధానిలోని మురికివాడలు, రద్దీ ప్రాంతాలు, హాస్పిటల్స్ పరిసరాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. న్యుమోనియా, బ్లడ్ ఇన్ఫెక్షన్లకు ఈ బగ్ కారణమవుతుందని తెలిపింది. WHO పరిమితికి మించి గాలిలో 16 రెట్లు అధికంగా బ్యాక్టీరియా వ్యాపించినట్టు తెలిపింది.


