News March 20, 2025
వనపర్తి: వృద్ధాప్య తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి: వి.రజని

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. గురువారం వనపర్తిలోని సీనియర్ సిటిజన్ ఫోరంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వారి సంరక్షణకు హెల్ప్ లైన్ నంబర్ 14567ను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News March 23, 2025
అల్లూరి జిల్లాలో చికెన్ ధర ఎంతంటే..

అల్లూరి రాజవొమ్మంగి పరిసర గ్రామాల్లో ఆదివారం స్కిన్‌లెస్ బ్రాయిలర్ చికెన్ కిలో రూ. 260కి, స్కిన్‌తో రూ. 240కి విక్రయించారు. గత వారం కంటే కిలో కి రూ. 20 పెరిగిందని వ్యాపారులు తెలిపారు. పాడేరు, చింతపల్లి, కొయ్యూరు, చింతూరు ఏరియాల్లో దాదాపు ఇదే రేటు పలికింది. వచ్చే రోజుల్లో ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రాంతంలో ఆదివారం 10 టన్నుల వరకు చికెన్ అమ్ముడు అవుతుందని తెలిపారు.
News March 23, 2025
KCRకు దొంగ నోట్లు ముద్రించే ప్రెస్: బండి సంజయ్

TG: మాజీ సీఎం కేసీఆర్‌కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నకిలీ నోట్లనే ఓటర్లకు పంచారన్నారు. ప్రస్తుతం భూములు అమ్మితే గానీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. అలాగే రాష్ట్రంలో ప్రతి పనికీ కమీషన్ల వ్యవహారం నడుస్తోందని విమర్శించారు.
News March 23, 2025
IPL: మ్యాచ్‌లకు వరుణుడు కరుణించేనా?

ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో SRH, RR మధ్య మ్యాచ్ జరుగుతోంది. కాగా మరికాసేపట్లో హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. మరోవైపు నగరంపై ఇప్పటికే మబ్బులు పట్టి ఉన్నాయి. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాత్రి 7.30 గంటలకు చెన్నైలో జరిగే CSK, MI మ్యాచుకూ వరుణుడి ముప్పు ఉన్నట్లు సమాచారం.