News February 13, 2025
వనపర్తి: ‘వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాలి’

బాలలను వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలపై ఉందని వనపర్తి జిల్లాన్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజని అన్నారు. బాలల బెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో అంతర్జాతీయ న్యాయమిషన్ వారు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. రజిని మాట్లాడుతూ.. బాండడ్ లేబర్‌కు వ్యతిరేకంగా ఈమాసంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Similar News
News December 16, 2025
GHMC డీలిమిటేషన్.. నేడు స్పెషల్ కౌన్సిల్ మీట్

GHMC డీలిమిటేషన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఎవరిని సంప్రదించి వార్డులు పెంచారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వాలని GHMC వారం రోజుల గడువు ఇవ్వగా వెయ్యికిపైగా ఆబ్లిగేషన్స్ వచ్చాయి. వీటిపై చర్చించేందుకు నేడు బల్దియా స్పెషల్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు పాలకవర్గం సమాధానం ఇవ్వనుంది. ఫైనల్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
News December 16, 2025
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
*మూడు రాజధానుల పేరుతో గత పాలకుల మహాకుట్ర: CBN
*మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం సక్సెస్: జగన్
*TG: యూరియా బుకింగ్ కోసం యాప్: మంత్రి తుమ్మల
*HYD రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ
*భారీగా పెరిగిన బంగారం ధరలు
*ఇండియాలో ముగిసిన GOAT మెస్సీ పర్యటన
News December 16, 2025
నూతన కానిస్టేబుళ్లతో రేపు సీఎం సమావేశం

AP: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో సీఎం చంద్రబాబు రేపు సమావేశం కానున్నారు. మంగళగిరి APSP 6వ బెటాలియన్ ప్రాంగణంలో 5PMకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 22 నుంచి వారికి ట్రైనింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. కాగా 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 6,014 మంది సెలెక్ట్ అయ్యారు. వీరిలో 5,757 మంది ట్రైనింగ్‌కు ఎంపిక అయ్యారు.


