News March 16, 2025
వనపర్తి: వెలుగొండలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అత్యధికంగా వెలుగొండలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెబ్బేర్ 41.3, కానాయిపల్లి 41.0, రేమోద్దుల 40.9, విలియంకొండ 40.9, పెద్దమందడి 40.5, గోపాల్ పేట 40.3, వనపర్తి 40.2, ఆత్మకూర్ 40.2, దగడ 40.1, రేవల్లి 40.0, జానంపేట 39.8, శ్రీరంగాపూర్ 39.7, ఘన్పూర్ 39.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్‌లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.
News December 5, 2025
కొనకనమిట్ల : ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి!

కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. ఇళ్లలోని వస్తువులు సైతం కదిలినట్లు చెప్తున్నారు. ఆ సమయంలో నిద్రలో నుంచి లేచి భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.
News December 5, 2025
మంచిర్యాల: సర్పంచ్ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావుపల్లికి చెందిన ట్రాన్స్‌జెండర్ వైశాలి సర్పంచ్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీని జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో వైశాలి సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి దిగారు. సర్పంచ్‌గా తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని ఆమె గ్రామ ప్రజలను కోరారు. ఆమె నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.


