News February 25, 2025
వనపర్తి: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

ఉమ్మడి MBNR జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. వివరాలిలా.. కొత్తకోటకు చెందిన చరణ్‌రెడ్డి, అనిల్ HYDకి వెళ్తూ బైక్ అదుపు తప్పి మృతిచెందారు. కొత్తపల్లి మండలం నిడ్జింతతండాలో వాహనం అదుపు తప్పి కిందపడటంతో మద్దూరుకు చెందిన రాములు చనిపోయారు. పెళ్లికి వచ్చిన బంధువులను తీసుకెళ్తుండగా బొలెరో వాహనం వారి బైక్‌ను ఢీకొనడంతో వడ్డేపల్లి మండల వాసి మురళి స్పాట్లోనే ప్రాణాలు వదిలాడు.
Similar News
News November 28, 2025
ఎయిరిండియా ఫ్లైట్‌లో సాంకేతిక లోపం.. టేకాఫ్ అయిన కాసేపటికే..

ఢిల్లీ విమానాశ్రయం నుంచి 170 మంది ప్రయాణికులతో గురువారం అహ్మదాబాద్ బయలుదేరిన AI2939 ఎయిరిండియా విమానం సాంకేతిక లోపం కారణంగా నిమిషాల్లోనే వెనక్కి వచ్చేసింది. కార్గో హోల్డ్ స్మోక్ అలర్ట్ రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీలో ల్యాండ్ చేశారు. సెక్యూరిటీ తనిఖీల తర్వాత అది తప్పుడు అలర్ట్‌గా నిర్ధారించారు. విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యిందని, ఎవరికీ గాయాలు కాలేదని ఎయిరిండియా ప్రకటించింది.
News November 28, 2025
మాటల యుద్ధం: డీకే ఏమన్నారంటే?

కర్ణాటక సీఎం, తన మధ్య SMలో <<18406507>>మాటల యుద్ధం<<>> నడుస్తోందనే ప్రచారాన్ని Dy.CM డీకే శివకుమార్ కొట్టిపారేశారు. తన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజ్యాంగ దినోత్సవం వేళ పేర్కొన్న మాటలు అలా అర్థమయ్యాయని ముంబైలో తెలిపారు. అలాగే తాను రాజకీయ భేటీ కోసం ముంబై వచ్చాననే ఆరోపణలను ఖండించారు. ఫ్యామిలీ ప్రోగ్రాంకు హాజరైనట్లు, రాజకీయ భేటీ అయితే బెంగళూరు లేదా ఢిల్లీలో ఉంటుందని స్పష్టం చేశారు.
News November 28, 2025
పంచాయతీల విభజనకు గ్రీన్‌సిగ్నల్

AP: స్థానిక సంస్థల ఎన్నికలకు SEC సిద్ధమవుతోంది. అందులో భాగంగా గ్రామ పంచాయతీల విభజన, పునర్వ్యవస్థీకరణపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఒక పంచాయతీని విభజించడం/పంచాయతీలోని గ్రామాలను మరో పంచాయతీలో కలపడం/2 పంచాయతీలను విలీనం చేయడానికి వీలవుతుంది. అలాగే పంచాయతీలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలపడానికి మార్గం సుగుమమవుతుంది. లోకల్ ఎలక్షన్స్‌కు ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుంది.


