News April 4, 2025

వనపర్తి: సన్న బియ్యం పంపిణీ వేగవంతం చేయండి: మంత్రి

image

రేషన్ దుకాణాలకు సన్న బియ్యం రవాణా, పంపిణీని వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. పేదల కోసం సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు.

Similar News

News November 1, 2025

విజయవాడ: NTRకి.. అచ్చొచ్చిన గది ఇదే.!

image

విజయవాడలోని దుర్గాకళామందిర్‌లోని ఓ గది అంటే నందమూరి తారక రామారావుకి ఎంతో సెంటిమెంట్. 1934లో ఆయన ఇక్కడే నాటకాలు వేసేవారు. ఆయన నటించిన మొత్తం 175సినిమాలు ఇక్కడే ప్రదర్శితమయ్యాయి. ఈ గది కలిసిరావడంతో, NTR విజయవాడ వచ్చినా, షూటింగ్‌లు జరిగినా హోటళ్లలో దిగకుండా ఇక్కడుండేవారు. TDP కార్యకలాపాలు కూడా ఇక్కడి నుంచే నడిచేవి. ఆయన ఉదయం వ్యాయామం చేసి, బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ,సాంబార్ తెప్పించుకునేవారు.

News November 1, 2025

కార్తీక శుద్ధ ఏకాదశి: ఎంత శుభప్రద దినమంటే?

image

కార్తీక శుద్ధ ఏకాదశి ఎంత పవిత్ర దినమో బ్రహ్మ, నారదులు వివరించారు. ఈరోజున ఏకాదశి వ్రతం చేస్తే.. పాపాలు పూర్తిగా తొలగి, 1000 అశ్వమేధ, 100 రాజసూయ యాగాల పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. కొండంత పత్తిని ఓ నిప్పు రవ్వ కాల్చినట్లుగా.. ఈ ఉపవాస వ్రతం వేల జన్మల పాపాలను దహించివేస్తుందని నమ్మకం. చిన్న పుణ్య కార్యమైనా పర్వత సమాన ఫలాన్నిస్తుందట. ఈ వ్రతం చేస్తే.. సాధించలేనిదంటూ ఉండదని బ్రహ్మ వివరించాడు.

News November 1, 2025

క్షేత్రస్థాయి వాస్తవ నివేదికలు సిద్ధం చేయండి: కలెక్టర్

image

ఖమ్మం: మొంథా తుఫాన్ నష్టం అంచనాలపై శనివారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా తప్పుడు ఫిగర్ను ఇవ్వకూడదని, నష్టం జరిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పరిహారం అందేలా చూడాలని సూచించారు. అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అంచనాలు తయారు చేయాలని అధికారులకు వివరించారు.